తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana ) ఎల్ఆర్ఎస్ (LRS) నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. అనుమతి లేకుండా అభివృద్ధి చేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు గతంలో విధించిన నిబంధనల్లో ఇప్పుడు జీవో 98 ద్వారా సవరణలు చేసింది. ఈ తాజా మార్పులు అనేకమంది యజమానులకు తలెత్తిన అర్హతల సమస్యలను పరిష్కరించేలా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
కేవలం రిజిస్టర్ సేల్ డీడ్ ఉన్న వారికి మాత్రమే
నూతన జీవో ప్రకారం, ఇప్పటి వరకు కేవలం రిజిస్టర్ సేల్ డీడ్ ఉన్న వారికి మాత్రమే ఎల్ఆర్ఎస్ కింద లబ్ధి చేకూరింది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో రిజిస్టర్ గిఫ్ట్ డీడ్, ఎక్స్ఛేంజ్ డీడ్, వారసత్వ ఆధారిత రిజిస్ట్రేషన్లు ఉన్న యాజమాన్య హక్కులను కూడా గుర్తింపు ఇచ్చి, వారిని ఎల్ఆర్ఎస్‌కు అర్హులుగా ప్రకటించారు. దీంతో మునుపటివరకూ రెగ్యులరైజేషన్‌కి అర్హతలే లేవన్న వారు కూడా తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం పొందారు.
నిర్మాణ అనుమతులు, బ్యాంక్ లోన్లు వంటి అనేక అంశాల్లో సౌలభ్యం
ఈ మార్పులతో అనేక మంది లబ్దిదారులకు స్పష్టతతో కూడిన పరిష్కారం లభించనుంది. అనుమతి లేని లేఅవుట్లను చట్టబద్ధంగా క్రమబద్ధీకరించుకోవడం వల్ల భవిష్యత్తులో నిర్మాణ అనుమతులు, బ్యాంక్ లోన్లు వంటి అనేక అంశాల్లో సౌలభ్యం కలుగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలలో మంచి స్పందన తెచ్చే అవకాశం ఉంది.
Read Also : Telangana Cabinet Meeting : ఈనెల 19న తెలంగాణ క్యాబినెట్ భేటీ?