ఈ రోజుల్లో ఉద్యోగం కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంటే, కొందరు మంచి ఉద్యోగం రావాలని మరికొందరు చదివిన చదువుకు తగ్గ హోదా ఉన్న ఉద్యోగం కోసం కోరుకుంటారు. ఇన్ఫోసిస్ బెంగుళూరులో ఒక యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ‘డ్రాగన్’ అనే తమిళ సినిమా చూసి సేమ్ టు సేమ్ అలంటి ఒక స్టంట్ చేసాడు. కానీ రీల్ లైఫ్’లో ఉన్నట్లు నిజ జీవితంలో ఉండదు కదా.. ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ న్యూస్ ప్రకారం 20 ఏళ్ల వ్యక్తి రాపా సాయి ప్రశాంత్ ఐటీ దిగ్గజ కంపెనీ వర్చువల్ ఇంటర్వ్యూ కోసం తన స్నేహితుడిని పంపినట్లు తేలడంతో మోసం నేరం కింద ఇప్పుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది.

దొరికిపోయిన సాయి ప్రశాంత్: ఇన్ఫోసిస్‌కు రిసీరుట్మెంట్ సొల్యూషన్స్ అందించే సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌లో అకౌంట్స్ మేనేజర్ కిషోర్ చేసిన పోలీసు కంప్లెయింట్ ప్రకారం, సాయి ప్రశాంత్ ఒక పోర్టల్ ద్వారా కంపెనీ ఉద్యోగానికి అప్లయ్ చేసుకుని తన రెజ్యూమ్‌ను పంపించాడు. కిషోర్ అతని అర్హతలను వెరిఫై చేసి, తన మేనేజర్ శివ ప్రకాష్ ద్వారా ఇన్ఫోసిస్‌కు రెస్యూమ్ పంపగా, ఆ తర్వాత ఇన్ఫోసిస్ వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహించింది, కానీ స్క్రీన్ మీదకు వచ్చింది ప్రశాంత్ కాదని, అతని తరపున తన స్నేహితుడిని ఇంటర్వ్యూకు హాజరు అయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడని తరువాత ఆరోపించారు. ఆ సమయంలో ఈ ప్లాన్ పనిచేసింది, తరువాత సాయి ప్రశాంత్‌కి 20 జనవరి 2025న ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. చివరకు వెంటనే కంపెనీలో చేరాడు. ఇంటర్వ్యూలో ఎలా వ్యవహరించాడో దానికి పూర్తిగా వేరేలా ఉన్నాడు. ఈ తేడా కారణంగా కంపెనీ సిబ్బంది ఇంటర్వ్యూ చేసిన స్క్రీన్షాట్లను సాయి ప్రశాంత్ ఫోటోతో క్రాస్ చెక్ చేసింది.సాయి ప్రశాంత్ అసలు విషయం బయటపడ్డాక అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు.
Read Also: Mohan Bhagwat: ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కు పాదం:మోహన్ భగవత్