Chat GPT: టెక్నాలజీలో(Technology) రోజుకో కొత్తరకం వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చాక వేగంగా మార్పులొస్తున్నాయి. దీంతో ఏఐ చాట్బాట్ల వినియోగం పెరిగిపోతోంది. ప్రతి చిన్న విషయానికి ఏఐపై ఆధారపడుతున్నారు. ఇక ఈ సాంకేతిక యుగంలో ‘చాటీజీపీటీ’కి ఉన్న ఆదరణ గురించి మనకు తెలిసిందే. ఇదేసమయంలో దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. ఇటీవల హానికరమైన కంటెంట్ ను అందిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో ఓ టీనేజర్ ను చాటిజీపీటీ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. మరో వ్యక్తి అయితే ఏకంగా చాటే జీపీటీ మాటలు విని కన్నతల్లినే చంపాడు. దీంతో భద్రతాపరమైన నియమాలపై చర్యలు తీసుకుంటోంది కంపెనీ.
పోలీసులకు ఫార్వర్డ్ అయ్యే అవకాశం
చాటీజీపీటీ వినియోగదారుల సందేశాల్లో ఇతరులకు హాని చేసేటువంటి కంటెంట్ ఉంటే.. అవి మానవ మోడరేటర్ల పరిశీలనకు వెళ్లడం, అవసరమైతే పోలీసులకు ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉందని ఓపెన్ఏఐ పేర్కొంది. తక్కువ సమయం పాటు జరిగే సంభాషణల్లో ఈ సేఫ్టీ సిస్టమ్ (Safety system)బలంగా పనిచేస్తుందని, దీర్ఘకాలంలో జరిగే చర్చల్లో లేదా పునరావృత సంభాషణల్లో ఈ భద్రత తగ్గే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. టీనేజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లేదా లైసెన్స్డ్ థెరపిస్టులతో కనెక్ట్ చేసే అవకాశాలపై కూడా కంపెనీ పరిశీలిస్తున్నట్లు సదరు కంపెనీ తెలిపింది. ఏదిఏమైనా మన సౌకర్యం కోసం మనమే ఏర్పాటు చేసుకున్న టెక్నాలజీని జ్ఞానయుక్తంగా వినియోగించడం కూడా అవసరమే. మన కంఫర్ట్ కోసం నియమించుకున్న సాధనాలు మనల్ని నాశనం చేసేలా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది.
చాట్‌జీపీటీ అంటే ఏమిటి?
చాట్‌జీపీటీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్, ఇది వాడుకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదు.
చాట్‌జీపీటీ వాడకంలో ప్రమాదాలు ఏమిటి?
తప్పుదారి పట్టించే సమాచారం, డేటా ప్రైవసీ సమస్యలు, మరియు నకిలీ కంటెంట్ సృష్టి వంటి ప్రమాదాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: