हिन्दी | Epaper

PVN Madhav: వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

Rajitha
PVN Madhav: వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

విజయవాడ : భారతీయ మెడ్క్ రంగం అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. గురువారం మైసూర్లోని ఎస్ 3వి టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్లో హార్ట్ వాల్యూథెరపీ అధ్యయన సమావేశంలో ముఖ్య అతిథిగా మాధవ్ హాజరై ప్రసంగించారు మాధవ్ మాట్లాడుతూ ముఖ్యంగా మైసూర్ కేంద్రంగా పనిచేస్తున్నఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీ. గుండె, మెదడు సంబంధిత అత్యవసర చికిత్సల కోసం స్వదేశీ సాంకేతికతతో కూడిన పరికరాలను రూపొందిస్తూందన్నారు.

Read also: Garlic benefits: 15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

PVN Madhav: An Indigenous Revolution in the Medical Devices Sector

PVN Madhav: An Indigenous Revolution in the Medical Devices Sector

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. పక్షవాతం చికిత్సలో స్వదేశీ మెకానికల్ థ్రాం బెక్టవీ కిట్ను ఎస్3వీ సంస్థ అభివృద్ధి చేస్తోందన్నారు. మెదడులోని రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే ఇస్కీమిక్ స్ట్రోక్ చికిత్స కోసం దేశంలోనే మొట్టమొదటిగా ఈ కిట్ నిలుస్తుందన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆర్ధిక సహకారాన్ని అందించిందన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి అత్యంత ఖరీదుకు దిగుమతి చేసుకుంటున్న ఈ పరికరాలు ఇకపై సామాన్యులకు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో మైవాల్ హార్ట్ వాల్వ్ ప్రాధాన్యత

అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వాల్వ్ మైవాల్ భారతీయ సంస్థ మెరిల్ లైఫ్ సైన్సెస్ రూపొందించిన మైవాల్ హార్ట్ వాల్వ్ అంతర్జాతీయ మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఇటీవలే లండన్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో వెల్లడించిన ఫలితాల ప్రకారం, అమెరికా దిగ్గజ కంపెనీలైన ఎడ్వర్డ్స్ లైఫ్ సైన్సెస్, మెడ్ట్రానిక్వాలతో సమానమైన ఫలితాలను మైవాల్ కనబరిచిందన్నారు. తద్వారా సామాన్యులకు అందుబాటులోకి ఆధునిక వైద్యం వచ్చిందన్నారు.

ఆయుష్మాన్ భారత్ ద్వారా తక్కువ ధరకే వైద్య పరికరాలు

గుండె రక్తనాళాల అడ్డంకులను తొలగించే పి.టి.సి.ఏ బెలూన్ కాథెటర్లనుకూడా ఎస్3వీ సంస్థ భారత్ లోనే తయారు చేస్తోంది ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా తక్కువ ధరకే అందించడం లక్ష్యంగా సంస్థ పనిచేస్తోందని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870