విజయవాడ పోలీస్
విజయవాడ : పోలీసింగ్ వ్యవస్థలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికతలను వినియోగించుకుంటూ విజయవాడ (ఎన్టీఆర్ జిల్లా) కమిషనరేట్(Commissioner Rajasekhar) మంచి ఫలితాలు సాధి స్తోంది. నేర నియంత్రణ, పరిశోధన, ఛేదన, ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణ, క్రౌడ్ మేనేజ్ మెంట్ సహా అనేక అంశాల్లో ఈ సాంకేతికతను పోలీ సులు ఏడాదిన్నరగా విస్తృతంగా వినియోగిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, నిర్వహణకు అస్త్రం పేరిట ఏఐ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తున్నారు.
Read Also: Andhra Pradesh:మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితి

ఏ సమయంలో ఏయే ప్రాంతాల్లో ఎంత ట్రాఫిక్ రద్దీ ఉందో, కారణాలేమిటో రియల్టైంలో గుర్తిస్తారు. ఆ మేరకు ట్రాఫిక్ సిబ్బందికి అప్రమత్తత సందేశాలు వెళ్తుంటాయి. వాటి ఆధారంగా రద్దీని నియంత్రిస్తున్నారు. అస్రం యాప్ను 2024 అక్టోబరు నుంచి వాడుతున్నారు. అప్పట్లో నగరంలోని 83 ట్రాఫిక్ కూడళ్ల పరిధిలో సగటు ట్రాఫిక్ కంజెషన్ పొడవు రోజుకు 97 కి.మీ. మేర ఉండేది. గతేడాది నవంబరుకు అది 48 కి.మీ.కి తగ్గింది. హిస్టారికల్ డేటా, ఈవెంట్స్, వీఐపీ పర్యటనలు, వాతావరణ వివరాల ఆధారంగా రాబోయే వారం రోజుల్లో ట్రాఫిక్ ఎలా ఉండబోతోందో అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.
వై ఐయామ్ స్టక్ట్ పేరిట ప్రజలకు యాప్
వై ఐయామ్ స్టక్ట్ పేరిట(Commissioner Rajasekhar) ప్రజలకు యాప్ ను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఏ కారణంతో వారు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారో, క్లియర్ అవడానికి ఎంత సమయం పడుతుందో యాప్ లో తెలుసు కోవచ్చు. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్లు, ఇతర అత్యవసర వాహనాలు రిజిస్టర్ చేసు కుంటే ఈపాథ్ ఎమర్జెన్సీ వెహికల్ ప్రయారిట్టీ పేరిట అనుమతినిస్తారు. ప్రజా భాగస్వామ్యంతో కమిషనరేట్ పరిధిలో 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చోరీలు, దోపిడీలు తదితర నేరాల ఛేదనలో ఇవి కీలక మయ్యాయి.
గతేడాది 816 కేసులు నమోదు కాగా, 596 (73 శాతం) ఛేదించారు. ఈ కేసుల్లో బాధితులు రూ.13.89 కోట్లు పోగొట్టుకోగా, రూ.11.21 కోట్లు (80.70 శాతం) రికవరీ చేయ గలిగారు. దేశంలో ఏ యూనిట్లోనూ ఇంత రికవరీ లేదని, ఇది రికార్డని అధికారులు చెబుతున్నారు. ఎక్కడ నేరం జరిగినా నిందితుల ఉనికి కనీసం నాలుగైదు కెమెరాల్లో చిక్కుతోంది. దీనివల్ల నేరాల ఛేదన, రికవరీ మెరుగు పడింది. ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో తొక్కిస లాటలు చోటుచేసుకోకుండా సమూహ నిర్వ హణ (క్రౌడ్ మేనేజ్మెంట్) కోసం రియల్టెం మోం టింగ్ కెమెరాల్ని వినియోగిస్తున్నారు. పర్వదినాలు, జాతరలు, ఉత్సవాల్లో ఆలయాలు, ప్రార్ధన మంది రాలకు వచ్చే వాహనాలు, మనుషుల్ని ఈ కెమెరాలు ఏఐ సాయంతో రియల్టైంలో లెక్కిస్తాయి, దాని ఆధా రంగా అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతు న్నారు. గతేడాది దుర్గగుడి దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణ సమయాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా, రద్దీ పెరగకుండా చూశారు. ఆలయం వద్ద ఏ సమయంలో భక్తుల రద్దీ ఎంత ఉంది? అమ్మవారి దర్శనానికి ఎంత సమయం పడుతుంది? క్యూలైన్లలో ఇంకా ఎంతమంది ఉన్నారు? తదితర వివరాల్ని కచ్చితంగా అంచనా వేయగలిగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగానూ దీన్ని వినియోగించారు. నగరంలోని 200కు పైగా ఆలయాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ముఖాదారిత గుర్తింపు విధానం
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా ఇతర కీలక ప్రాంతాల్లో 126 ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు(ముఖాలను గుర్తించగలిగే కెమెరాలు) ఏర్పాటు చేశారు. సీసీటీఎన్ఎ స్ డేటాబేస్ లోని 1.30 లక్షల మంది పాత నేరగాళ్ల చిత్రాలు, వివరాలను వాటితో అనుసంధానించారు. నగరంలో పాత వారి నేరగాళ్లు తిరుగుతూ కెమెరాల్లో చిక్కితే ఫేషియల్ రికగ్నిషన్ సెంటర్కు అప్రమత్తత సందేశం వస్తోంది. దాని ఆధారంగా వారిపై నిఘా పెడుతున్నారు.
ఫలితం: గతేడాది అక్టోబరు నుంచి దీనిని అమలు చేస్తున్నారు. దసరా ఉత్సవాల సమయంలో పాత నేరగాళ్ల కదలికల్ని గుర్తించి వారిని పట్టుకున్నారు. పలు కీలక కేసుల ఛేదనలో ఈ వ్యవస్థ ఉపయోగపడింది. అదృశ్యమైన (మిస్సింగ్) వారి ఫొటోలను ఈ డేటాబేస్కు అనుసంధానించి, ఆచూకీ కనిపెడు తున్నారు. బందోబస్తు ప్రణాళిక రూపకల్పన, సిబ్బం దికి విధుల కేటాయింపు గతంలో మ్యాన్యువల్గా చేసేవారు. దీనికి కనీసం 23 రోజుల సమయం పట్టేది, ఈడిప్లొయ్మెంట్ వల్ల ఇప్పుడు 6 గంటల్లోపే ప్రక్రియ పూర్తవుతోంది. సిబ్బంది వారికి కేటాయించిన పాయింట్లకు వెళ్లిన వెంటనే క్యూఆర్, జియో ఫెన్స్డ్ ఆధారిత హాజరు పడిపోతోంది.
డ్రోన్ కమాండ్ కంట్రోల్ సెంటర్
డ్రోన్ పోలీసింగ్లో భాగంగా స్టేషన్కు ఒకటి చొప్పున 42 డ్రోన్లు ఇచ్చారు. వీటి ద్వారా తీసే దృశ్యాల విశ్లేషణ పర్యవేక్షణకు డ్రోన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పేరిట డ్యాష్బోర్డు అభివృద్ధి చేశారు. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 వేల కెమెరాల్ని డ్యాష్బార్డుకు అనుసంధానించారు. దీనిద్వారా అవి సరిగ్గా పనిచేస్తున్నాయా, లేదా పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా కెమెరా పనిచేయకపోతే వెంటనే అప్రమత్తత సందేశం వస్తుంది. అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు. ట్రయల్ రన్ చేసి ప్రాజెక్టును సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నారు. నిరంతరం
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: