ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆర్టిఫీషియల ఇంటెలిజెన్స్ (ChatGPT)చరిత్ర సృష్టిస్తోంది. టెక్నాలజీ రంగంలో ఈ కృతిమ మేధస్సు (ఏఐ) అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఎలాంటి ప్రశ్నలకైనా క్షణాల్లోనే సులభంగా సమాధానాలను అందిస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతం
ఈ ఏఐ టెక్నాలజీ వల్ల రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. పెద్ద పెద్ద సమస్యలను సైతం సునాయాసంగా పరిష్కారాలు చూపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా స్పందిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఏఐ. తాజాగా అలాంటి ఒక ఘటన గురించి ఒక నెటిజెన్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఇప్పుడు పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
ChatGPT ద్వారా సరైన నిర్ధారణ
తనకు 10 సంవత్సరాల నుండి వేధిస్తున్న ఓ ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభించలేదని, చాట్‌జీపీటీ ద్వారా సరైన సమాధానం లభించిందని చెప్పాడు. ఈ సమస్య గురించి ఎందరో వైద్యులను సంప్రదించినప్పటికీ వారి నుంచి పరిష్కారం లభించలేదని, ఈ చాట్‌జీపీటీ(ChatGPT)తో పరిష్కారం లభించిందన్నారు. రెడ్డిట్ లో ‘@Adventurous-Gold6935’ అనే యూజర్.. “చాట్‌జీపీటీ 10+ఏళ్ల సమస్యను నిమిషాల్లోనే పరిష్కరించింది. వైద్యులు దీన్ని కనుగొనలేకపోయారు” అనే శీర్షికతో ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. గత పదేళ్లుగా లభించని పరిష్కారం.. ఈ చాట్ పీజీటీ ద్వారా క్షణాల్లోనే లభించిందని అన్నారు. తాను స్పైనల్ MRI, CT స్కాన్, రక్త పరీక్షలు, లైమ్ వ్యాధి కోసం కూడా పరీక్షలు చేయించానని పోస్ట్‌లో తెలిపాడు.

వైద్య పరీక్షలు, డాక్టర్ల నిర్లక్ష్యం
చాలా మంది నెటిజన్లు తమ సొంత సమస్యలను పంచుకోవడం ప్రారంభించడంతో పోస్ట్ త్వరగా వైరల్ అయింది. చాట్ పీజీటీ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి దీన్ని ఎలా మారుస్తుందో కూడా చాలా మంది వ్యాఖ్యానించారు. దేశంలోని ఎన్నో ముఖ్యమైన ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నాను.. న్యూరాలజిస్ట్‌తో సహా అనేక నిపుణులను సంప్రదించినా, నా సమస్యకు సరైన నిర్ధారణ జరగలేదు. తాను ఫంక్షనల్ హెల్త్ పరీక్ష చేయించాను, అప్పుడు నాకు హోమోజైగస్ A1298C MTHFR మ్యూటేషన్ ఉన్నట్లు తెలిసింది. ఈ సమస్య 7–12 శాతం మందిలో మాత్రమే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు.
MTHFR మ్యూటేషన్ గుర్తింపు
తన ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలను, ల్యాబ్ రిపోర్ట్‌ను చాట్ జీపీటీలో నమోదు చేసినప్పుడు ఈ మ్యూటేషన్ గురించి తెలిసిందని అన్నారు. ఈ సమస్య MTHFR మ్యూటేషన్‌తో సంబంధం ఉందని చెప్పాడు. అయితే నా శరీరంలో బి12 లెవెల్స్ సాధారణంగా కనిపించినా, ఈ మ్యూటేషన్ వల్ల శరీరం బి12ని సరిగ్గా ఉపయోగించలేకపోతోంది. అందుకే సప్లిమెంట్లు తీసుకోవాలి అని చాట్‌జీపీటీ సూచించినట్లు ఆయన చెప్పాడు. ఇతంత తెలుసుకునే తానే షాక్ అయ్యానని అన్నాడు.
నెటిజెన్ల స్పందన
అనేక మంది తమ సమస్యలు షేర్ చేస్తున్నారు. ఏఐ, ప్రత్యేకంగా (ChatGPT), వైద్యరంగాన్ని ఎలా మారుస్తుందోపై చర్చ మొదలైంది. నిపుణులు కూడా ఏఐకి భవిష్యత్తులో కీలక పాత్ర ఉన్నదిగా అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Shubhamshu Shukla : అంతరిక్షంలో ఆహారం, నిద్ర ఎలా ?