ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)(Artificial intelligence) వల్ల ఉద్యోగాలకు ముప్పు పెరుగుతున్న తరుణంలో, అల్బేనియా ప్రభుత్వం ఒక వినూత్నమైన, చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో అవినీతిని అరికట్టేందుకు ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక ఏఐ(AI)-ఆధారిత మంత్రిని నియమించింది. ఈ ఏఐ మంత్రి పేరు ‘డియెల్లా’, దీనిని అల్బేనియా ప్రధానమంత్రి ఎడీ రమా తన కొత్త మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అల్బేనియా ప్రభుత్వ రంగంలో, ముఖ్యంగా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ టెండర్ల కేటాయింపులో అవినీతి తీవ్రంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అవినీతికి అడ్డుకట్ట వేయడానికి మానవ జోక్యం లేని, పారదర్శకమైన వ్యవస్థ అవసరమని ప్రభుత్వం భావించింది.

డియెల్లా’ పనితీరు, లక్ష్యాలు
డియెల్లా అనేది ఒక వర్చువల్(Virtual) అసిస్టెంట్. ఇది అల్బేనియా(Albania) సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళ రూపంలో ఉంటుంది. ఇది ఇప్పటికే ఇ-అల్బేనియా అనే ప్రభుత్వ సేవల ప్లాట్‌ఫామ్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. డియెల్లా తన కృత్రిమ మేధస్సుతో డేటాను విశ్లేషించి, టెండర్లను పర్యవేక్షించి, నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ తరహా నియామకం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఇది ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచంలో మొదటి ఏఐ మంత్రి ఏ దేశంలో నియమించబడ్డారు?
అల్బేనియా.
ఏఐ మంత్రి పేరు ఏమిటి?
డియెల్లా.
Read hindi news: hindi.vaartha.com
Read also: