tata

సంక్షోభ సమయంలో నేనున్నాంటూ ముందుకు వచ్చిన ‘టాటా’

భారత్ ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు.

కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. గొప్ప వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సేవకుడిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాటా మరణం దేశానికి పూడ్చలేని నష్టాన్ని మిగిల్చిందని, అలాంటి గొప్ప వ్యక్తిని మరల చూడలేమని కామెంట్లు చేస్తున్నారు. రతనీ అసలైన ‘భారతరత్న’మని కొనియాడుతున్నారు. రతన్ 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పుడూ దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.10వేల కోట్లుగా ఉంది. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టాటా గ్రూపును విస్తరించారు. స్టీల్, ఆటో మొబైల్ వంటి రంగాల్లో విస్తృతపరిచారు. కంపెనీ బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూ చేపట్టిన సంస్కరణలతో పదవి నుంచి దిగిపోయే సరికి రెవెన్యూను రూ. లక్ష కోట్లకు చేర్చారు.

Related Posts
కుంభమేళాలో రూ.30 కోట్లు సంపాదించిన ఓ కుటుంబం : సీఎం
A family earned Rs. 30 crores at the Kumbh Mela.. CM

లక్నో: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీలో మహా కుంభమేళా పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. కుంభమేళా వల్ల ఎంతోమంది Read more

Atchannaidu : ప్రతి రైతునూ ఆదుకుంటాం – మంత్రి అచ్చెన్న
minister atchannaidu

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వడగండ్ల వానల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని పరిగణలోకి తీసుకుని, ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు Read more

పర్యావరణ కార్యకర్త తులసి గౌడ ఇక లేరు..
tulsi gowda

తులసి గౌడ, 86 సంవత్సరాల వయస్సు గల ప్రముఖ భారతీయ పర్యావరణ వేత్త, డిసెంబర్ 16, 2024న కర్ణాటక రాష్ట్రం, దావణగెరే జిల్లాలో మరణించారు. ఆమె ఆరోగ్య Read more

కోహ్లీపై తేల్చి చెప్పిన రేవంత్.
కోహ్లీపై తేల్చి చెప్పిన రేవంత్.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల దావోస్ పర్యటనలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ పర్యటన ద్వారా ఆయన రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను పరిచయం చేయడంతో Read more