అన్ని భాషల సినిమాల్లోనూ ఐటెం సాంగ్ అంటే మేకర్స్‌కి ముందుగా తమన్నానే గుర్తుకొస్తుంది. రజినీకాంత్ ‘జైలర్’,, బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’లో తమన్నా చేసిన ఐటెం సాంగ్స్ సూపర్‌హిట్ అయ్యాయి. నువ్వు కావాలయ్యా అంటూ జైలర్‌లో తమన్నా వేసి స్టెప్పులకు ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారు.అందానికి అందం, ఆపై అదరగొట్టే డ్యాన్సులతో తమన్నా తన రేంజ్‌ను పెంచుకుంటూనే ఉంది. అందువల్లే ఆమెతో సినిమాలో ఒక్క సాంగ్ అయినా చేయించాలని మేకర్స్ తాపత్రయపడుతుంటారు.ఈ నేపథ్యంలోనే మరో భారీ బడ్జెట్‌లో మూవీలో తమన్నా ఐటెం సాంగ్‌కి రెడీ అయిపోయింది. అజయ్ దేవ్‌గణ్ తాజా చిత్రం ‘రైడ్ 2’లో తమన్నా ప్రత్యేక గీతంలో నటించనుంది. ఈ పాటలో ఆమెతో పాటు యో యో హనీసింగ్‌కు కూడా డ్యాన్స్ చేయనున్నాడు. గతంలో అజయ్ దేవ్‌గణ్ సరసన తమన్నా ‘హిమ్మత్ వాలా’లో నటించిన సంగతి తెలిసిందే.
మైలురాయి
స్త్రీ -2 మూవీలోని తమన్నా ఐటమ్ సాంగ్ ‘ఆజ్ కీ రాత్’ కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన విజయ్ గంగూలీయే దీనికి కూడా పనిచేయనుండటం ఆసక్తి రేపుతోంది. ముంబయిలోని ఓ స్టుడియో ఈ వారంలోనే ఈ సాంగ్‌కి షూట్ చేయనున్నారు.తమన్నా నషా సాంగ్ లో నటించబోతుంది. తమన్నా ఒక ప్రత్యేక గీతంలో (నషా సాంగ్) నటించబోతుంది. బాలీవుడ్ నటుల్లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ, యాక్షన్, మాస్, కామెడీ, డ్రామా, ప్రయోగాత్మక చిత్రాల్లోనూ తనదైన శైలిలో నటనను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న నటుడు అజయ్ దేవగన్. ఇప్పుడు ఆయన మరోసారి మాస్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రైడ్ 2. ఈ చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన ఇదివరకు ‘రైడ్’ అనే చిత్రాన్ని 2018లో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నిజ జీవితంలో జరిగిన ఆదాయపు పన్ను దాడులను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం అజయ్ దేవగన్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ రూపొందుతోంది.

కీలక పాత్ర
ఈ సీక్వెల్‌లోనూ అజయ్ దేవగన్ ఆదాయపు పన్ను శాఖ అధికారి పాత్రలోనే కనిపించనున్నారు. కానీ ఈ సారి కథ మరింత బలంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడుకుని ఉండనుందని సమాచారం.ఎప్పటిలాగే అజయ్ దేవగన్ శక్తివంతమైన పాత్రలో, అధికారంగా, గంభీరంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నారు.రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.
Read Also: Darshan: దర్శన్ తీరుపై కోర్ట్ ఆగ్రహం