స్నేహితుల దినోత్సవం (Friendship Day) సందర్భంగా అందరూ తమ స్కూల్ డేస్ ఫ్రెండ్స్‌ను గుర్తు చేసుకుంటుంటే, హీరోయిన్ తమన్నా (Tamannaah) మాత్రం అందరికీ విభిన్నంగా స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక భావోద్వేగ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హైలైట్ అయింది.తన అభిప్రాయం ప్రకారం, స్కూల్, కాలేజ్ రోజుల్లో దొరికే స్నేహాల కంటే.పెద్దయ్యాక ఏర్పడే బంధాలే జీవితాన్ని ఇస్తాయట.తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఓ చిన్న వీడియో షేర్ చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ,”ప్రతి ఫోన్ కాల్ నేను ‘ఐ లవ్ యూ’తోనే ముగిస్తాను. ఎందుకంటే ఆ కాల్ ఎవరి మనసు ఎలా ఉందో తెలుసుకోవడానికే. నాకు నిజమైన స్నేహితులు స్కూల్‌లో కాక, వయసు పెరిగాకే దొరికారు. వాళ్లే నాకు జీవితాంతం తోడుండే స్నేహితులు” అని చెప్పారు.

సెలబ్రిటీల నుంచి కవితా స్పందన
తమన్నా భావోద్వేగ పోస్టుకు టాలీవుడ్, బాలీవుడ్ నుండి గట్టిగానే స్పందన వచ్చింది. నటి మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ,అయ్యో… ఇది చదివి ఏడుపొస్తోంది, అంటూ కామెంట్ చేశారు. ఆమె ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ,నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నాకు ఎంతో ఆనందం. ప్రేమను నిండుగా ఇచ్చే స్నేహితురాలివి నువ్వు. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను అని ఎమోషనల్‌గా రాశారు.
కాజల్, రాషా కూడా తమన్నాను ఓదార్చారు
తమన్నాకు ముద్దుగా ‘తమ్మూ’ అని పిలిచే కాజల్ అగర్వాల్, “ఐ లవ్ యూ తమ్మూ! హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే” అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చారు.ఇక ఆమె మిత్రురాలు రాషా తడాని “నువ్వు నన్ను ఏడిపించేలా ఉన్నావు. ఐ లవ్ యూ! అంటూ స్పందించారు. వీళ్లంతా తమన్నా మాటల్లోని నిజాయితీకి ఫిదా అయ్యారు.
సినిమాల్లోనూ బిజీగా ఉన్న తమన్నా
ప్రస్తుతం తమన్నా నటిస్తున్న “వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్” సినిమా చర్చనీయాంశమైంది. ఈ చిత్రం ద్వారా ఆమె మొదటిసారి బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో స్క్రీన్ షేర్ చేయనున్నారు.ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. డైరెక్టర్ అరుణాభ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, టీవీఎఫ్ నిర్మిస్తున్నాయి.
తమన్నా చెప్పిన స్నేహం డెఫినిషన్ వైరల్ అవుతోంది
తమన్నా చెప్పిన మాటలు కేవలం సెలెబ్రిటీలనే కాదు, సామాన్యుల హృదయాలనూ తాకాయి. “పెద్దయ్యాక ఏర్పడే స్నేహమే అసలైనదని” ఆమె చెప్పిన దృక్కోణం కొత్తగా అనిపిస్తోంది. ప్రతి మాటలో నిజాయితీ, అనుబంధం పలుకుతోంది. ఆమె వీడియో ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ అవుతోంది.
Read Also : Jagan : ఆ డబ్బు లెక్కలు చూసింది జగన్ : మంత్రి సత్యకుమార్