ప్రస్తుతం డయాబెటిస్ బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారతదేశంలో దాదాపు 10 కోట్లకు పైగా ప్రజలు ఈ వ్యాధితో పోరాడుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇది చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి వయస్సులోని వారిని ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ దేశవ్యాప్తంగా పెరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా 25-35 ఏళ్ల మధ్య వయస్సు వారిలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రధాన కారణాలు
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం,మధ్యం సేవించడం,వేళకు నిద్రపోకపోవడం,నిద్ర మేల్కొనడం,శారీరక వ్యాయామం లేమి,తగిన ఆహార నియమాలను పాటించకపోవడం,జన్యుపరమైన కారణాలు (టైప్-1 డయాబెటిస్).
డయాబెటిస్ లక్షణాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. అవి:అలసటగా అనిపించడం,తరచూ మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం రావడం,గొంతు ఎండిపోవడం,ఆకలి మితిమీరడం లేదా తగ్గిపోవడం,ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ నివారణ
రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి,ఉదయం లేదా సాయంత్రం గంటపాటు వాకింగ్ చేయడం మంచిది,ఆహారంలో చక్కెర, ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి,జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్లు వీలైనంతవరకు తగ్గించాలి,రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు.
డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి,గోధుమ రొట్టె, బ్రౌన్ రైస్,కూరగాయలు (క్యారెట్, కీరా, టమోటా),ఆకుకూరలు (పాలకూర, ముల్లంగి ఆకు),ప్రోటీన్లు (పప్పులు, సోయా, కోడిగుడ్లు),పండ్లు (జామ, పుచ్చకాయ, నారింజ, యాపిల్).తెల్ల బియ్యం, మైదా, పంచదార,సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్,జంక్ ఫుడ్, తినకూడదు.
డాక్టర్ అజిత్
డిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ అజిత్ జైన్ మాట్లాడుతూ, “డయాబెటిస్ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే దీనిని నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, వ్యాయామం చేయడం, తగిన పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా దీన్ని అదుపులో ఉంచవచ్చు” అని అన్నారు.ఈ వ్యాసంలో అందించిన ఆరోగ్య సమాచారం పరిశోధనలు, నిపుణుల సూచనల ఆధారంగా మాత్రమే. దీన్ని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.