swedon

స్వీడన్ స్కూల్‌లో కాల్పులు, 11 మంది మృతి

స్వీడన్ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా స్కూల్‌లో కాల్పులు జరగడంతో.. ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల్లో నిందితుడు సహా మొత్తం 11 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది. తుపాకీతో స్కూల్ క్యాంపస్‌లోకి చొరబడిన నిందితుడు.. విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో మొత్తం 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత నిందితుడు కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ కాల్పులు జరిపింది ఒక్కడేనని.. అతడు గతంలో నేరస్థుడు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరెబ్రో నగరంలోని ఒక అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పారు.

10 మంది విద్యార్థులు, ఒక నిందితుడు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భారీ ఎత్తున భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని చర్యలు ప్రారంభించాయి. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాల్లో బాధితులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న స్వీడన్ అధికారులు.. దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఉగ్రదాడి కాదని మాత్రం తేల్చేశారు.
నిందితుడు ఈ కాల్పులు జరిపిన సమయంలో ఆ స్కూల్ క్యాంపస్‌లో చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండటంతో ప్రాణ నష్టం తగ్గిందని స్కూల్ యాజమాన్యం తెలిపింది. కాల్పుల శబ్ధం విన్న విద్యార్థులు, టీచర్లు.. క్లాస్ రూంల నుంచి పరుగులు తీసినట్లు చెప్పారు. ఈ కాల్పుల ఘటనపై స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్‌ క్రిస్టర్సన్‌ స్పందించారు. ప్రశాంతంగా ఉండే స్వీడన్‌లో ఇలాంటి కాల్పుల ఘటన జరగడం చాలా అరుదని పేర్కొన్నారు. స్వీడన్‌కు ఇది ఎంతో బాధాకరమైన రోజు అని పేర్కొన్నారు.

Related Posts
ISRO-NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం
ISRO NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం

ISRO-NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం ప్రతి 12 రోజులకు దాదాపు భూమి మొత్తం మరియు మంచును స్కాన్ చేస్తుంది, అలాగే ఇది అధిక రిజల్యూషన్ కలిగి ఉంటుంది. Read more

ఆజర్బైజాన్ విమాన ప్రమాదంపై రష్యా కఠిన చర్యలు..
ajerbaijan

డిసెంబర్ 25న ఆజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం కూలిన ఘటనపై, ఆజర్బైజాన్ సాధికారుల రీతిలో రష్యా తమ చర్యలను చేపట్టేందుకు సంకల్పించింది. ఈ ఘటనపై రష్యా ప్రజా ప్రాసిక్యూటర్ Read more

భారత్-తాలిబాన్ కీలక సమావేశం
భారత్-తాలిబాన్ కీలక సమావేశం

భారతదేశం నుండి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి మావ్లావి అమీర్ ఖాన్ ముత్తాకీ ఈ సమావేశానికి హాజరయ్యారు. తాలిబాన్ Read more

Donald Trump: ట్రంప్‌ను మైక్‌తో కొట్టిన రిపోర్టర్.. అయన రియాక్షన్ ఏంటంటే?
విద్యాశాఖను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను అల్లాడిస్తున్నారు. అయితే Read more