‘మహిళ’ అనే పదానికి అర్థం ఏంటో యూకేలోని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ‘మహిళ’అంటే చట్టపరంగా ఇదే అర్థం వస్తుందని పేర్కొంది. ఒక మహిళను చట్టపరంగా ఎలా నిర్వచించాలన్న దానిపై యూకే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అమ్మాయిలుగా పుట్టినవారికి మాత్రమే చట్టప్రకారం, లింగపరంగా మహిళల గుర్తింపు దక్కుతుందని యూకే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
ఏళ్లపాటు సుదీర్ఘ న్యాయపోరాటం
స్కాట్ లాండ్ ప్రభుత్వం vs ఓ మహిళా గ్రూప్ కేసులో భాగంగా యూకేలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఎన్నో ఏళ్లపాటు సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఈ తీర్పు వెల్లడైంది. సమానత్వ చట్టం- 2010 ప్రకారం ‘స్త్రీ’ ‘లింగం’ అనే పదాలు పుట్టుకతో అమ్మాయిలుగా పుట్టినవారిని, పుట్టుకతో ఏ లింగానికి చెందినవారు అన్న విషయాలను మాత్రమే సూచిస్తాయని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

లింగమార్పిడి చేయించుకున్నంత మాత్రాన మహిళ కాదు
లింగమార్పిడి చేయించుకున్నంత మాత్రాన మహిళ కాదని ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లింగ గుర్తింపు సర్టిఫికెట్(జీఆర్‌సీ)తో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు లింగ ఆధారిత రక్షణ హక్కు కలిగి ఉంటారని స్కాట్ లాండ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, ట్రాన్స్ జెండర్ లకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి లార్డ్ హోడ్జ్ తెలిపారు.
పుట్టుకతో వచ్చే లింగం గుర్తింపా?
‘లింగం’ అనే పదం అర్థాన్ని లండన్ కోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో వెల్లడించారు. పుట్టుకతో వచ్చే లింగం గుర్తింపా? లేక 2004 లింగ గుర్తింపు చట్టం ప్రకారం లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు పొందే సర్టిఫికెట్ ఆధారంగా లభించే న్యాయపరమైన గుర్తింపా? అన్నది సుప్రీంకోర్టు తేల్చింది. ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు) విషయంలో ఈ తీర్పు స్పష్టతనిచ్చింది.
Read Also: Time’s Influential People: ప్రతిభావంతుల జాబితాలో భారతీయుడికి దక్కని చోటు