నౌహీరా షేక్‌‌కు సుప్రీంకోర్టు బిగ్ వార్నింగ్

నౌహీరా షేక్‌‌కు సుప్రీంకోర్టు బిగ్ వార్నింగ్

పలు స్కీమ్‌ల పేరుతో రూ.వేలకోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించి.. మోసగించిన హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌కు సర్వోన్నత న్యాయస్థానం రెండు ఆప్షన్లు ఇచ్చింది. మూడు నెలల్లోగా డిపాజిటర్ల నుంచి సేకరించిన రూ.25 కోట్లను చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని తేల్చిచెప్పింది. లక్షలాది మంది నుంచి పలు స్కీమ్‌ల పేరుతో రూ.5,600 కోట్లు వసూలుచేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో బుధవారం నాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాదితుల నుంచి సేకరించిన రూ.25 కోట్లను 90 రోజుల్లోగా నౌషెరా షేక్ తిరిగి ఇవ్వకుంటే కస్టడీలోకి తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ (ఈడీ)ని ఆదేశించింది.

నౌహీరా షేక్‌‌కు సుప్రీంకోర్టు బిగ్ వార్నింగ్


ధర్మాసనం హెచ్చరిక
లొంగిపోయే గడువు పొడిగించిన నవంబర్ 11, 2024 నుంచి కోర్టు వెలువరించిన ఆదేశాలను నిందితురాలు వరుసగా ధిక్కరిస్తున్నారని, ఆమె రూ. 25 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘మూడు నెలల్లోగా డిపాజిటర్ల సొమ్ము రూ.25 కోట్లు తిరిగి చెల్లించాలి.. నిందితులకు ఇదే చివరి అవకాశం.. అలా కాకుంటే బెయిల్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.. ఈడీ జైలుకు పంపుతుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. నౌషెరా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్.. ఆమె వద్ద డబ్బులేదని చెప్పారు. అయితే, షేక్ పేరును ఉన్న అనేక ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. కానీ, వేలానికి ఇబ్బందులు లేని ఆస్తుల జాబితాను ఇవ్వాలని ఆమె న్యాయవాది కోరితే వివరాలను మాత్రం వెల్లడించలేదు. తన పేరుతో కేవలం మూడు ఆస్తులే ఉన్నాయని వివరాలు సమర్పించిన షేక్.. వాటిలోని తెలంగాణలోని రెండింటిని ఈడీ వేలం వేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
నమ్మించి నిలువునా ముంచేశారు
ఇక, హీరా గోల్డ్ కేసులో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) విచారణ కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ సహా పలు చోట్ల ఈ కేసులో పెండింగ్‌లో ఉన్నారు. నగలు, బంగారం స్కీమ్‌లు పేరుతో డబ్బులు వసూలు చేసి.. పెట్టుబడికి 36 శాతం డివిడెంట్ ఇస్తామని నమ్మించి నిలువునా ముంచేశారు. ప్రారంభించిన కొత్తలో డివిడెండ్ చెల్లించి.. భారీగా డిపాజిట్లు సేకరించిన తర్వాత బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదుకాగా.. అక్టోబరు 2018లో నౌషెరా షేక్‌ను అరెస్ట్ చేశారు.

Related Posts
తమిళ భాషపై స్టాలిన్ ఆందోళన
తమిళ భాషకు ముప్పు! స్టాలిన్ ఆందోళన వ్యక్తం

హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా హిందీ భాషను ఇతర రాష్ట్రాలపై Read more

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పులు..ఇద్దరు మావోయిస్టుల మృతి
2 Maoists Dead In Chhattisgarh Encounter

కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు Read more

ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ కీలక భేటీ!
ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ కీలక భేటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ కసరత్తు మొదలు పెట్టారు. అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా తమిళగ Read more

కేసులతో పోసాని ఉక్కిరిబిక్కిరి
కేసులతో పోసాని ఉక్కిరిబిక్కిరి

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ప్రస్తుతం విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనపై నమోదైన పలు ఫిర్యాదుల కారణంగా వరుసగా పీటీ వారెంట్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *