India Post: ‘తోకలేని పిట్టకు’ కొత్త రెక్కలు!

Follow Us: Google News Daily Hunt
India Post
India Post
FONT SIZE
GET APP

India Post:బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ద్వారా భారతదేశంలో అక్టోబర్ 1,1854న అధికారికంగా ప్రారంభించబడిన ఆధునిక తపాలా వ్యవస్థ, అక్టోబర్ 1, 2026 నాటికి 172 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 1947లో స్వాతంత్రం పొందే నాటికి కేవలం 23,344 పోస్ట్ ఆఫీసులతో అధిక శాతం నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న తపాలా వ్యవస్థ, స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్గా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా నెట్వర్క్ ఇండియా పోస్ట్ మొదటి స్థానంలో ఉంది. 2026 నాటికి భారతదేశంలో దాదాపు 4 లక్షల సిబ్బందితో మొత్తం 1,64,999 ໓ ລ້ (గ్రామీణ ప్రాంతాల్లో 1,49,385, నగర/పట్టణ ప్రాంతాల్లో 15,614) ఉన్నాయి. ఇండియా పోస్ట్ కేవలం ఉత్తరాల సేవలకు మాత్రమే పరిమితం కాకుండా, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, రిటైల్ రంగాలలో బహుముఖ సేవల కేంద్రంగా విస్తరించింది. భారతదేశంలో సందేశ వ్యవస్థల చరిత్ర మౌర్య సామ్రాజ్యం నాటి వేల సంవత్సరాల నాటిది అయినప్పటికీ, నేటి నేటి ఏకీకృత, అధికారిక తపాలా వ్యవస్థ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని అక్టోబర్ 1వ తేదీగా పరిగణిస్తారు. దేశాన్ని అనుసంధానించడంలో ఈ శాఖ పోషిస్తున్న నిరంతర పాత్రను వేడుకగా జరుపుకోవడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన జాతీయ తపాలా దినోత్సవం నిర్వహిస్తారు. ఇండియా పోస్ట్ తన విస్తారమైన దేశవ్యాప్త నెట్వర్క్ ద్వారా ప్రధానంగా మూడు రకాల సేవలను అందిస్తుంది. అవి 1) తపాలా, పార్శిల్ సేవలు 2) ఆర్థిక, బ్యాంకింగ్ సేవలు, 3) ప్రభుత్వ, ఇతర సేవలు.

  1. తపాలా, పార్శిల్ సేవలు

అ) స్పీడ్ పోస్ట్: భారతదేశం అంతటా పత్రాలు, పార్శిళ్ల కోసం వేగవంతమైన, నమ్మకమైన సమయబద్ధమైన డెలివరీ సేవ. ఇందులో ఆన్లైన్ ట్రాకింగ్, ఎస్ఎంఎస్ అప్డేట్లు ఉంటాయి.

ఆ) రిజిస్టర్డ్ పోస్ట్: సురక్షితమైన తపాలా డెలివరీ, ఇది ట్రాకింగ్, డెలివరీ రుజువును అందిస్తుంది. చట్టపరమైన లేదా అధికారిక లేఖలకు ఇది చాలా అనువైనది.

ఇ) స్టాండర్డ్ మెయిల్: లేఖలు, సాధారణ పోస్ట్కార్డులు, ముద్రిత సామగ్రి కోసం సరసమైన రోజువారీ ఎంపికలు. ఈ) పార్శిల్ సేవలు: దేశీయ, అంతర్జాతీయ షిప్పింగ్ ఎంపికలు, ఇ కామర్స్ విక్రేతల కోసం క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడి) సదుపాయం కూడా ఉంటుంది.

  1. ఆర్థిక, బ్యాంకింగ్ సేవలు

అ) పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (పిఓఎస్బి): పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ కార్యకలాపాలలో భాగంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి చిన్న పొదుపు పథకాలు, సర్టిఫికేట్లు అందుబాటులో ఉంటాయి. ఆ) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి): ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇండియా పోస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఇపిఎస్) ద్వారా నగదు ఉపసంహరణలు, యుటిలిటీ బిల్లుల చెల్లింపుల సేవలను అందిస్తుంది. ఆ) తపాలా జీవిత బీమా (పిఎల్ఐ ఆర్పిఎల్): ఇండియా పోస్ట్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పిఎస్ఐ) రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (ఆర్పిఎస్ఐ) పథకాల ద్వారా పట్టణ, గ్రామీణ పౌరుల కోసం ప్రభుత్వ మద్దతుతో జీవితసదుపాయం అందిస్తుంది.

  1. ప్రభుత్వ ఇతర సేవలు

అ) పాస్ పోర్ట్ సేవ: ఇండియా పోస్ట్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున, నిర్దేశిత తపాలా కార్యాలయ కౌంటర్లలో పాస్ పోర్ట్ దరఖాస్తులను స్వీకరించడం, ప్రాసెస్ చేయడం. ఆ) ఆధార్ సేవలు: ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల ద్వారా ఆధార్ నమోదు, నవీకరణ సౌకర్యాలు కల్పిస్తుంది. ఇ) ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు (డిబిటి): ప్రభుత్వ పెన్షన్లు, ఎంజిఎన్ఆర్ఎజిఎస్ వేతనాలు, సబ్సిడీలను పంపిణీ చేయడం. ఈ) ఫిలాటెలీ: స్మారక, నిర్దిష్ట తపాలా బిళ్ళల రూపకల్పన, ముద్రణ, అమ్మకం. ఇండియా పోస్ట్ తన కార్యకలాపాలను ఆధునీకరించడానికి 2012 తర్వాత అనేక కీలక డిజిటల్, బ్యాంకింగ్, రవాణా (లాజిస్టికల్) సేవలను ప్రవేశపెట్టింది. ఐటి ఆధునీకరణ ప్రాజెక్ట్ కింద గ్రామీణ పోస్ట్ ఆఫీస్ డిజిటల్ అభివృద్ధి (DARPAN /RICT)లో భాగంగా గ్రామీణ పోస్టల్ ఉద్యోగులకు రియల్ టైమ్ లావాదేవీలు, ట్రాకింగ్ కోసం చేతిలో ఇమిడిపోయే (హ్యాండ్బాల్ద్) పరికరాలను ప్రవేశపెట్టింది. సమయ పరిమిత టైమ్ష్యూర్డ్) స్పీడ్ పోస్ట్ సేవలలో భాగంగా ఓటిపి ధృవీకరించబడిన డ్రాప్ ఆఫ్లు, రియల్టైమ్ ఎస్ఎంఎస్ ట్రాకింగ్తో హామీ ఇవ్వబడిన 1 రోజు (డి+1), 2రోజుల (డి+2) డెలివరీలను అందించే ప్రీమియం సమయ పరిమిత డెలివరీ సేవలు ప్రారంభించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ), ప్రభుత్వ దరఖాస్తుల కోసం పౌరులు ఎలక్ట్రానిక్ పోస్టల్ ఫీజులను చెల్లించడానికి అనుమతించే ఇఐపిఓ (ఎలక్ట్రానిక్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్) ఆన్లైన్ సదుపాయం తీసుకువచ్చింది. 2013-2016 మధ్య కాలంలో ప్రారంభమైన కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ (సిబిఎస్) మరియు ఎటిఎం వ్యవస్థ ద్వారా ఇంటర్ ఆపరేబుల్ పొదుపు ఖాతాలు, ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్, ఎన్ఐఎఫ్టి, ఆర్టీజిఎస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీని ద్వారా సొంత బ్రాంచ్లోనే కాకుండా, భారతదేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్లోనైనా నగదును డిపాజిట్ చేసే లేదా విత్అ చేసుకునే సౌకర్యంతో పాటు పోస్ట్ ఆఫీస్ ఖాతా, ఇతర వాణిజ్య బ్యాంకులలోని ఖాతాల మధ్య ఆన్లైన్లో డబ్బును బదిలీ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 2018లో ప్రారంభించబడిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి), సులభంగా అందుబాటులో ఉండే ఇంటి వద్దకే (డోర్ స్టెప్) బ్యాంకింగ్, పొదుపు ఖాతాలు, డిజిటల్ చెల్లింపు సేవలను ప్రారంభించబడ్డాయి.

ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ మెయిల్ సేవలు

విమానాల ఆవిష్కరణ జరిగిన కేవలం 8 సంవత్సరాల తర్వాత, భారతదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి అధికారిక విమాన తపాలా పంపిణీ జరిగింది. 1911 ఫిబ్రవరి 18న, ఫ్రెంచ్ పైలట్ హెన్రీ పెకెట్ తన హంబర్ బైప్లేన్లో సుమారు 6,000 కార్డులు, ఉత్తరాలతో కూడిన ఒక సంచిని తీసుకువెళ్ళాడు. ఈ విమాన ప్రయాణం అలహాబాద్ లోని ఒక పోలో మైదానం నుండి యమునా నది మీదుగా నైని వరకు ఐదు మైళ్ళ దూరం సాగింది. ఆ ఉత్తరాల పై ‘ఫస్ట్ ఏరియల్ పోస్ట్, 1911, యు. పి. ఎగ్జిబిషన్ అలహాబాద్’ అని రాసి ఉన్న ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు.

ప్రపంచంలోనే ఎత్తైన స్థానంలో..

1983లో హిమాచల్ ప్రదేశ్లోని అత్యంత కష్టతరమైన మరియు ఎత్తైన ప్రదేశంలో చల్లని, మారుమూల స్పితి లోయలో ఉన్న హిక్కిం గ్రామంలో ఒక పోస్ట్ ఆఫీస్ స్థాపించబడింది. సముద్ర మట్టానికి 4,440 మీటర్ల (14,567 అడుగులు) ఎత్తులో నిటారుగా ఉండే కొండచరియలు, పలుచని గాలి, రాతి మార్గాలతో చుట్టుముట్టబడి ఉండే ఈ పోస్ట్ ఆఫీస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తపాలా కార్యాలయం. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువకు పడిపోవడం, భారీగా మంచు కురవడం వల్ల, ఆ సమయంలో కార్యాలయాలను మూసివేయవలసి వస్తుంది. మోటారు వాహనాలు వెళ్ళే రోడ్లు లేకపోవడం వల్ల, ఉత్తరాలను తరచుగా కాజాకు చాలా దూరం, ప్రమాదకరమైన మార్గాల్లో కాలినడకన తీసుకువెళ్లవలసి ఉంటుంది. ఇది, ఏకాంతంగా నివసించే స్థానిక సమాజాలకు ఒక కీలకమైన సమాచార జీవనాధారంగా, పొదుపు బ్యాంకుగా పనిచేస్తుంది.

India Post:మెయిల్, పార్శిల్ సేవలు

స్పీడ్ పోస్ట్: వేగం, భద్రత, బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన దేశీయ, అంతర్జాతీయ మెయిల్, పార్శిల్ సేవలను ఇండియా పోస్ట్ విస్తృతంగా అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉత్తరాలను వేగంగా, నమ్మకంగా చేరవేయడానికి తపాలా శాఖ 1986 ఆగస్టు 1న స్పీడ్ పోస్ట్ను ప్రవేశపెట్టింది. ఇండియా పోస్ట్ ఆధునీకరణ ప్రయత్నాలలో భాగంగా ప్రారంభించబడిన ఈ సేవ, నిర్ణీత సమయంలో, సమర్థవంతంగా, సురక్షితంగా ఉత్తరాలను చేరవేసేలా రూపొందించబడింది. సంవత్సరాలు గడిచేకొద్దీ, ప్రైవేట్ కొరియర్ కంపెనీలకు గట్టి పోటీనిస్తూ, స్పీడ్ పోస్ట్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, విశ్వసనీయమైన తపాలా సేవల్లో ఒకటిగా నిలిచింది. 35 కిలోగ్రాముల వరకు బరువున్న అత్యవసర పత్రాలు పార్సెల్ల రవాణా కోసం స్పీడ్ పోస్ట్ ఒక హై స్పీడ్ సమయబద్ధమైన సేవ. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే ఈ సేవ ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపే పార్సెల్లకు ఎస్ఎంఎస్ ట్రాకింగ్, ఆన్లైన్ ట్రాక్ అండ్ ట్రేస్ వంటి సౌకర్యాలు ఉంటాయి. వేగవంతమైన స్పీడ్ పోస్ట్ వ్యవస్థపై పూర్తి దృష్టి సారించేందుకు, ‘రిజిస్టర్డ్ పోస్ట్’ వంటి పాత సేవల నిర్వహణ 2025 చివరలో అధికారికంగా నిలిపివేయబడింది. మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి స్పీడ్ పోస్ట్ నిరంతరం అభివృద్ధి చెందుతూ వస్తోంది. దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డెలివరీ సేవగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, విశ్వసనీయత, భద్రత, వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో దీనిని ఇప్పుడు ఓటిపి ఆధారిత సురక్షిత డెలివరీ, ఎస్ఎంఎస్ ఆధారిత డెలివరీ నోటిఫికేషన్లు, సౌకర్యవంతమైన ఆన్లైన్ బుకింగ్ సేవలు, రియల్టైమ్ డెలివరీ అప్డేట్లను కూడా అందిస్తోంది.

బుక్ పోస్ట్ స్థానంలో జ్ఞాన్ పోస్ట్

1898 నాటి వలసవాద కాలం నాటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం స్థానంలో 2023 పోస్ట్ ఆఫీస్ చట్టం అమలులోకి రావడం ద్వారా డిసెంబర్ 18, 2024న ఇండియా పోస్ట్ అధికారికంగా సబ్సిడీతో కూడిన బుక్ పోస్ట్ లేదా బుక్ ప్యాకెట్ సేవలను నిలిపివేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా 2025 ఏప్రిల్/మేలో జ్ఞాన్ పోస్ట్ ప్రవేశపెట్టింది. ట్రాకింగ్ సదుపాయంతో రోడ్డు రవాణా ద్వారా అందించే ఈ మెయిల్ సేవ విద్యా సంబంధిత పార్శిళ్లను డెలివరీ చేస్తుంది. అయితే, ఈ సేవ కేవలం నమోదిత విద్యా సంస్థలకు మాత్రమే పరిమితం చేయబడింది.

ఇండియా పోస్ట్ పార్సెల్ (రిటైల్)

వ్యక్తిగత, బల్క్ కస్టమర్ల కోసం తన ప్రామాణిక దేశీయ పార్సెల్ ఎంపికగా ఇండియా పోస్ట్ పార్సెల్ (రిటైల్) సేవను అందిస్తుంది. అన్ని సాధారణ పార్సెల్లు ట్రాక్ చేయబడిన, అకౌంటబుల్ మెయిల్గా పరిగణించబడతాయి. ఈ సేవ కింద గరిష్టంగా 35 కిలోల వరకు బరువున్న పార్సెల్లు ఉపరితల రవాణా ద్వారా పంపబడతాయి. అదనపు రుసుముతో క్యాష్ ఆన్ డెలివరీ (సిఓడి), బీమా (ఇన్స్యూరెన్స్), గ్రహీతకు ప్రత్యేకమైన డెలివరీ, డెలివరీ రుజువు వంటి ఐచ్చిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రిజిస్టర్డ్ లెటర్/పార్శిల్: భారతదేశంలో రిజిస్టర్డ్ ఉత్తరం, పార్శిల్ అనేవి ఇండియా పోస్ట్ ద్వారా అందించబడే సురక్షితమైన, జవాబుదారీ తపాలా సేవలు. ఇవి గ్రహీతకు ప్రత్యేకంగా డెలివరీ చేయబడతాయని, రసీదు రుజువు ఉంటుందని హామీ ఇస్తాయి.

అంతర్జాతీయ ట్రాక్ట్ ప్యాకెట్ సర్వీస్ (ఐటిపిఎస్): ప్రాథమిక అంతర్జాతీయ తపాలా సేవలలో భాగంగా ఇండియా పోస్ట్ ఉత్తరాలు, పోస్ట్ కార్డులు, ఏరోగ్రామ్, అంధుల సాహిత్యం, ముద్రిత పత్రాలు, ఎం బ్యాగ్ (ఒకే చిరునామాలో ఒకే గ్రహీతకు వార్తాపత్రికలు, పత్రికలు, పుస్తకాలు.. ఇలాంటి ముద్రిత పత్రాలు ఉండే ప్రత్యేక సంచులు) సేవలు అందిస్తుంది. బరువైన సరుకులు, బహుమతుల కోసం వాయు, ఉపరితల, లేదా సర్ఫేస్ ఎయిర్ లిప్టెడ్ అంతర్జాతీయ పోస్టులో, పార్సెల్ పోస్ట్ విభాగంలో అంతర్జాతీయ ఎయిర్ పార్సెల్, అంతర్జాతీయ సర్ఫేస్ ఎయిర్ లిఫ్టెడ్ పార్సెల్స్ (ఎస్ఏఎల్), అంతర్జాతీయ సర్ఫేస్ పార్సెల్స్ వంటి అంశాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పత్రాలు, వస్తువులను పంపడానికి ఎక్స్ ప్రెస్ మెయిల్ సర్వీస్ (ఈఎంఎస్) అత్యంత వేగవంతమైన సేవ. సమయానికి చేరాల్సిన పత్రాలు, సరుకులను ప్రపంచవ్యాప్తంగా పంపడానికి, ఎండ్లుఎండ్ ట్రాకింగ్తోతో కూడిన అత్యంత వేగవంతమైన ఎంపిక ఇది. అంతర్జాతీయ ఉత్తరాల పోస్టులోని వస్తువులను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసులలో బుక్ చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ 219 గమ్యస్థానాలతో దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రధాన గమ్యస్థానాలను కవర్ చేసే ఇంటర్నేషనల్ లెటర్ పోస్ట్ నెట్వర్క్ కలిగి ఉంది. డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసులలో బుక్ చేసుకోవచ్చు లేదా డాక్ సేవా యాప్ వంటి సాధనాల ద్వారా డిజిటల్గా షెడ్యూల్ చేసుకోవచ్చు. పార్సెల్ విలువ, అందులోని వస్తువులను బట్టి ప్రామాణిక కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్లు (దివి22 లేదా దివి23 వంటివి) పార్శిల్స్ తో విధిగా జతచేయాల్సి ఉంటుంది. పారదర్శక డెలివరీ కోసం రిజిస్ట్రేషన్, బీమా ఎంపికలు, ఆన్లైన్ ట్రాకింగ్ అందుబాటులో ఉంటుంది. ఇండియా పోస్ట్ అధిక విలువ కలిగిన ఎగుమతి రవాణాలో అధిక వాటా దక్కించుకునేందుకు చురుకుగా ప్రయత్నిస్తోంది. డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రాలను (ఎగుమతి కేంద్రాలు) ఉపయోగించుకోవడం ద్వారా, ఇది భారతీయ ఎగుమతిదారుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన ‘డైరెక్ట్ లైన్’ సేవలను ఏర్పాటు చేసింది. దీనితో పాటు, డిహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్తో ప్రీమియం గ్లోబల్ ఎక్స్ప్రెస్ ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది.

రికార్డు స్థాయిలో ఆదాయం

కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ‘డిడి ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియా పోస్ట్ ఆదాయం రు.15,373 కోట్లకు పెరిగిందని, ఇది ఆ శాఖ 170 యేళ్ల చరిత్రలోనే అత్యంత కీలకమైన ఆర్థిక మైలురాళ్లలో ఒకటి అని పేర్కొన్నారు. 2016లో శాఖ ఆదాయం సుమారు.11,500 కోట్లుగా ఉండేదని, ఆ తర్వాతి కాలంలో సగటున ఏటా రు.200-300 కోట్ల వృద్ధి నమోదైందని మంత్రి తెలిపారు. అయితే, ఈ ఏడాది మాత్రం రూ.2,100 కోట్ల మేర గణనీయమైన వృద్ధి (ఒకే సంవత్సరంలో) నమోదయ్యిందని ఇది గత సగటుతో పోలిస్తే దాదాపు పది రెట్లు ఎక్కువ అని తెలిపారు. ఈ గణనీయమైన మార్పుకు ఒక పద్ధతితో కూడిన ‘ద్విముఖ ‘ (Dual-pronged Approach) 5 ລ້ వివరించారు. ఇందులో మార్కెట్ పరిధిని గుర్తించడం, లక్ష్యాల నిర్దేశం, జవాబుదారీతనంతో కూడిన ‘టాప్స్ డౌన్'(పై స్థాయి నుండి కింది స్థాయికి) విధానం, అలాగే ఉద్యోగుల భాగస్వామ్యాన్ని పెంచే ‘బాటమ్ప్’ (కింది స్థాయి నుండి పై స్థాయికి) విధానాలు మిళితమై ఉన్నాయి. కార్యకలాపాలకు అడ్డంకులుగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించి, ఫలితాలను సాధించేలా ఒక వ్యవస్థాగత చట్రాన్ని రూపొందించిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు.

అంతేకాకుండా, సాంకేతికత వినియోగం, విస్తృతమైన ఈ కామర్స్ భాగస్వామ్యాల కారణంగా ఇండియా పోస్ట్ పార్శిల్, లాజిస్టిక్స్ విభాగం 70 శాతం వృద్ధిని నమోదు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత నాయకత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు, మొత్తం పార్శిల్ ఆదాయం సుమారు రు.600 కోట్లుగా ఉండేది. ఓటిపి ఆధారిత డెలివరీ, ఎస్ఎంఎస్ ట్రాకింగ్, యుపిఐ, డిజిటల్ చెల్లింపుల స్వీకరణ, అలాగే ప్రధాన ఈ కామర్స్ ప్లాట్ఫారమ్లతో బి2బి (బిజినెస్ టు బిజినెస్) ఒప్పందాల వంటి చర్యల వల్ల, కేవలం పార్శిల్ సేవల ద్వారానే రు.10,000 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించే సామర్ధ్యం ఏర్పడిందని అంచనా. వేగవంతమైన డెలివరీ కోసం రవాణా మార్గాల హేతుబద్దీకరణ (రూట్ రేషనలైజేషన్) చేపట్టారు. విస్తృతమైన ప్రయోగాత్మక పరిశీలన తర్వాత, భారీ ప్రజా అవగాహన కార్యక్రమాల మద్దతుతో ఆరు మెట్రో నగరాల్లో 24 గంటలు, 48 గంటల స్పీడ్ పోస్ట్ డెలివరీ సేవలను ఇండియా పోస్ట్ ప్రారంభించడంతో పోస్ట్ ఆఫీస్ సేవలకు ఆదరణ పెరిగింది. సంప్రదాయ ఉత్తరాల సేవలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున, లాజిస్టిక్స్, పార్శిల్ సేవలే ఆ శాఖకు ప్రధాన వృద్ధి రంగాలుగా నిలుస్తాయని డాక్టర్ పెమ్మసాని పేర్కొన్నారు.

ఇండియా పోస్ట్ ఆధునీకరణ ప్రక్రియలో ఐటీ 2.0లో భాగంగా చేపట్టిన అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపిటి) కార్యక్రమం కింద చేసిన రూ.5,800 కోట్ల పెట్టుబడి ఒక కీలకమైన అంశం. పోస్ట్ ఆఫీసుకు వెళ్లకుండానే, పౌరులు కేవలం ఒక్క క్లిక్తో బ్రౌజర్ ద్వారా పొదుపు సాధనాలు, పిఎస్ఐ, ఆర్పిఎల్ఐ వంటి బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి, డిజిటల్ సర్టిఫికేట్లను తక్షణమే డౌన్లోడ్ చేసుకోవడానికి, మెచ్యూర్ అయిన పాలసీ మొత్తాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోకి స్వీకరించడానికి వీలు కల్పించే పూర్తి డిజిటల్, ఎండుఎండ్ సేవలపై తమ శాఖ దార్శనికతను వినియోగదారులు స్వాగతించినట్లు సహాయ మంత్రి వివరించారు. దేశంలోనే అత్యధిక వడ్డీ రేట్లలో ఒకటైన 4 శాతం వడ్డీ రేటును అందించే పోస్టల్ పొదుపు ఖాతాలు, ప్రముఖ వాణిజ్య బ్యాంకులు అందించే సుమారు 2.5 శాతం కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి. ఈ డిజిటల్ అందుబాటు ప్రోత్సాహం ద్వారా ఈ ఖాతాలు గణనీయంగా విస్తృత ఆదరణ పొందుతాయని భావిస్తున్నారు. ఐటీ 2.0 కింద భద్రతా నిర్మాణంలో సిస్టమ్ యాక్సెస్ కోసం ఫేషియల్ రికగ్నిషన్, ఇ కేవైసీ, ఆధార్ లింకింగ్, జాతీయ క్లౌడ్ సెక్యూరిటీ ప్రొటోకాల్ కు పూర్తి అనుగుణ్యత వంటివి ఉన్నాయి.

ఇండియా పోస్ట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ద్వారా, ప్రస్తుతం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబిటి) ద్వారా ఏటా సుమారు రు.45,000 కోట్లను పంపిణీ చేస్తోంది. తద్వారా ఇది దేశంలోనే అతిపెద్ద లాస్ట్ మైల్ సంక్షేమ పంపిణీ మార్గాలలో ఒకటిగా నిలుస్తోంది. మొబైల్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు, ప్రింటర్లతో కూడిన ఐపిపిబి ప్రతినిధులు, నిధుల పంపిణీ, బిల్లుల వసూళ్లతో సహా ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను నేరుగా గ్రామీణ కుటుంబాలకు అందించడం తపాలా సేవలను మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. బాలికల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘సుకన్య సమృద్ధి’ పథకాన్ని ఈ శాఖ పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద 3.8 కోట్ల మంది బాలికలు నమోదు చేసుకున్నారు. దాదాపు ప్రతి గ్రామంలో ఉన్న సుమారు 2.5 లక్షల మంది సిబ్బందితో కూడిన గ్రామీణ డాక్ సేవక్ నెట్వర్క్ ద్వారా మహిళా కేంద్రీకృత
పొదుపు ఉత్పత్తులు, స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జి) అనుసంధానాలు, అధికవడ్డీ గ్రామీణ పొదుపు ఖాతాలను చురుకుగా ప్రోత్సహిస్తున్నారు. ఈ నెట్వర్క్ ఇండియా పోస్టు వెన్నెముకగా సహాయ మంత్రి అభివర్ణించారు. డిబిటి లబ్దిదారులకు వారి ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడానికి, జనాభా ఆధారితంగా తగిన బీమా, పొదుపు ఉత్పత్తులపై సూచనలు ఇవ్వడం కూడా శాఖ భవిష్యత్ ప్రణాళికలో ఉందని డాక్టర్ పెమ్మసాని పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల ఉన్నతీకరణతో

పాటు, ఇండియా పోస్ట్ తన సిబ్బంది అంతటా ఒక భారీ సామర్థ్య నిర్మాణ మరియు ప్రవర్తనా పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టింది. వినియోగదారులతో సంభాషణ, సేవల పంపిణీ, అమ్మకాల నైపుణ్యాలపై దృష్టి సారిస్తూ ప్రతి 100 మంది ఉద్యోగులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. లావాదేవీల దృక్పథం నుండి వినియోగదారు కేంద్రీకృత దృక్పథానికి మారే ఈ సాంస్కృతిక, ఆలోచనా విధాన మార్పు, ఏదైనా సాంకేతిక జోక్యం వలెనే విభాగం పరివర్తనకు అంతర్భాగమని డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని నొక్కి చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా సంభాషించడానికి, శాఖ వివరించడానికి, వికసిత్ యొక్క ఆర్ధిక స్థితిని భారత్ దార్శనికతను సాకారం చేయడంలో వారి పాత్రను తెలియజేయడానికి దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. దీనికి సమాంతరంగా, ఇండియా పోస్ట్ తన పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ను సమగ్రంగా భౌతికంగా ఆధునీకరిస్తోంది. పట్టణ పోస్ట్ ఆఫీసులను ఒక్కో కేంద్రానికి రు.60-70 లక్షల పెట్టుబడితో పునరుద్ధరిస్తున్నారు.
వీటిలో డిజిటల్ కౌంటర్లు, సరళీకృత ఆధార్ అప్డేషన్ సేవలు, వాటి ప్రాంగణంలోనే ఉమ్మడి కార్యస్థలాలు ఉంటాయి. భారతదేశ యువతతో అనుసంధానం కావడానికి, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలలో సాంస్కృతిక అంశాలు, డిజిటల్ సౌకర్యాలను పొందుపరుస్తూ అత్యాధునిక పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో, ప్రతి ఇంటికీ సేవలు చేరేలా, వర్తించే పథకాలలో నమోదు చేసేలా, వారికి అందుబాటులో ఉన్న పూర్తి స్థాయి పోస్టల్ ఆర్థిక సేవల గురించి అవగాహన కల్పించేలా విస్తృత కవరేజీపై దృష్టి కేంద్రీకరించబడింది.

ఆర్థిక, బ్యాంకింగ్ సేవలు

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (పిఓఎస్బి), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ద్వారా ఇండియా పోస్ట్, ఆర్థిక సమ్మిళితానికి ఒక కీలకమైన ఆసరాగా పనిచేస్తుంది. ఐపిపిబి రోజువారీ 3.8 కోట్లకు పైగా లావాదేవీలను నిర్వహిస్తుండగా, విస్తృతమైన పిఓఎస్బి భారతదేశపు విశాలమైన తపాలా నెట్వర్క్ లక్షలాది సాంప్రదాయ చిన్న పొదుపు ఖాతాలను నిర్వహిస్తుంది. ఐపిపిబి దేశవ్యాప్తంగా 1,62,468 యాక్సెస్ పాయింట్ల ద్వారా 13.25 కోట్లకు పైగా వినియోగదారులకు (ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో) సేవలు అందిస్తుంది. సెప్టెంబర్ 2026 నాటికి ఐపిపిబి ద్వారా రు.29,320 కోట్లకు పైగా విలువ గల 3.88 కోట్ల లావాదేవీలు జరగడం విశేషం. మార్చి 2026 నాటికి, ఐపిపిబి డిపాజిట్ల మొత్తం రూ.29,104 కోట్లుగా ఉండడం ఈ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియచేస్తుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (పిఓఎస్బి) ద్వారా ప్రభుత్వ మద్దతుతో నడిచే సాంప్రదాయ చిన్న పొదుపు పథకాలు, పొదుపు ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పిపిఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి) సేవలను అందిస్తుంది. 1.55 లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసులతో అనుసంధానించబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్న పిఓఎస్బి పాస్బుక్లు, ఫిజికల్ ఎటిఎం కార్డులను ఖాతాదారులకు అందిస్తోంది.

సులభమైన స్వీప్ ఇన్/స్వీర్అవుట్ బదిలీల కోసం పిఓఎస్బి పొదుపు ఖాతాలను నేరుగా ఐపిపిబి ఖాతాలతో అనుసంధానించే వెసులుబాటు కూడా ఉంది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) నెట్వర్క్ ద్వారా ఏటా రు.45,000 కోట్లకు పైగా నిధులు సురక్షితంగా నేరుగా పౌరులకు పంపిణీ చేయబడతాయి. సెప్టెంబర్ 2026లో తన 9వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఐపిపిబి ఆధునాతన డిజిటల్ మ్యూచువల్ ఫండ్, డిజిటల్ ఇన్సూరెన్స్ టెక్నాలజీ వేదికలను ప్రారంభించింది. ఇవి పెట్టుబడి పోర్ట్ఫోలియోలు, థర్డ్ పార్టీ బీమా పరిష్కారాలకు మొబైల్ ద్వారా సులభమైన ప్రాప్యతను కల్పిస్తాయి. నానాటికి పెరిగిపోతున్న సైబర్ నేరాల నేపథ్యంలో, మోసాలను నియంత్రించేందుకు, నిరంతరాయ కాగితరహిత లావాదేవీలను అందించే క్రమంలో తప్పనిసరి బయోమెట్రిక్ ఆధార్ ఆధారిత ఇకెవైసి, మొబైల్ లింకింగ్ వ్యవస్థలు అన్ని శాఖలలో అమలులోకి వచ్చాయి.

ఇకామర్స్ అనుసంధానం

ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థల గుత్తాధిపత్యానికి కళ్ళెం వేసేందుకు ఇండియా పోస్ట్ ప్రధాన ఇకామర్స్ వెబ్ సైట్లతో బలమైన బి2బి (బిజినెస్ టు బిజినెస్) భాగస్వామ్యాలను ఏర్పరచుకుంది. ఇది ఇండియా పోస్ట్ సాటిలేని గ్రామీణ లాస్ట్ మైల్ మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటుంది.

ఉపసంహరించబడిన సేవలు

మనీ ఆర్డర్: 135 సంవత్సరాల వారసత్వం తర్వాత, ఇండియా పోస్ట్ 1880లో సాంప్రదాయ కాగితం ఆధారిత మనీ ఆర్డర్ సేవ ద్వారా పోస్ట్మాన్లు భారతదేశం అంతటా ఇంటి వద్దకే నిధులను పంపిణీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగ లేదా
వ్యాపారరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే పంపేందుకు వీలు కల్పించే ఈ విధానం దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. దీనిని ఏప్రిల్ 2015లో ఉపసంహరించి, దాని స్థానంలో 2006లో ఇన్స్టంట్ మనీ ఆర్డర్ (ఐఎంఓ)ను, డిజిటల్గా బదిలీలను వేగవంతం చేయడానికి అక్టోబర్ 2008లో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ (ఇఎంఓ)ను ప్రారంభించింది. టెలిగ్రామ్: 1854 ఏప్రిల్ 27న ప్రజలకు అందుబాటులోకి వచ్చిన టెలిగ్రామ్ సేవ జులై 14, 2013న అధికారికంగా నిలిపివేయబడింది. 1850లో కలకత్తా, డైమండ్ హార్బర్ మధ్య మొట్టమొదటి ప్రయోగాత్మక టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు చేయబడింది. ముంబై-పూణే మధ్య మొదటి అధికారిక టెలిగ్రామ్ పంపడంతో, 1854 ఏప్రిల్ 27న ఈ సేవ ప్రజలకు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. 1914 ఏప్రిల్ 1న టెలిగ్రాఫ్ వ్యవస్థను తపాలా శాఖతో విలీనం చేశారు. ఆ తర్వాత 1985 జనవరి 1న దీనిని తపాలా శాఖ నుండి వేరు చేసి, టెలికమ్యూనికేషన్స్ శాఖ లేదా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ద్వారా నిర్వహించారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో టెలిగ్రాఫ్ సేవలకు ఆదరణ తగ్గడంతో, 160 యేళ్ల సుదీర్ఘ సేవాకాలం తర్వాత, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ 2013 జులై 14న దేశవ్యాప్తంగా టెలిగ్రాఫ్ కార్యకలాపాలను శాశ్వతంగా నిలిపివేసింది.

మారిన దృక్పథం

సాంప్రదాయ ఉత్తరాల పరిమాణం క్రమంగా తగ్గుతుండటంతో, ఇండియా పోస్ట్ పార్శిళ్లు, లాజిస్టిక్స్ ను (రవాణా) తన ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకునేందుకు కృషి చేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో మొత్తం ఆదాయంలో 75 శాతం పార్శిళ్లు, మెయిల్ ద్వారా ఆర్జించేందుకు లక్ష్యం నిర్దేశించుకుంది. భారీ స్థాయి దేశీయ ఈకామర్స్ కార్యకలాపాలను నిర్వహించేందుకు, ఇండియా పోస్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, షిప్రికెట్, డిటిడిసి వంటి ప్రైవేట్ దిగ్గజాలతో బలమైన అనుసంధానాన్ని ఏర్పరచుకుంది. ఆధునిక లాజిస్టిక్స్, ఇ కామర్స్, డిజిటల్ సేవల మార్కెట్లలో భారీ వాటాను దక్కించుకోవడానికి ఇండియా పోస్ట్ దూకుడుగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక నిర్మాణాత్మక పరివర్తన ప్రణాళిక కింద, ఈ విభాగం ఒక సాంప్రదాయ తపాలా సంస్థ నుండి అత్యంత పోటీతత్వం గల, సాంకేతికతతో కూడిన సంస్థగా రూపాంతరం చెందింది. ఈ దూకుడుతో కూడిన వ్యూహాత్మక మార్పు ఇండియా పోస్ట్ ఆర్థిక నివేదికలపై (బ్యాలెన్స్ షీట్) ఇప్పటికే గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు