వరుసగా మూడు సెషన్ల నుంచి నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈరోజు లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ఫార్మా(Reality, Pharma) సూచీల అండతో మార్కెట్లు లాభపడ్డాయి. ఒకానొక సమయంలో 800 పాయింట్ల మేర లాభపడ్డ సెన్సెక్స్(Semsex)… చివరకు 410 పాయింట్ల లాభంతో 81,596 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 24,813 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.64గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.02%), టాటా స్టీల్ (1.86%), సన్ ఫార్మా (1.57%), టెక్ మహీంద్రా (1.39%), బజాజ్ ఫైనాన్స్ (1.36%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.39%), కొటక్ మహీంద్రా (-0.77%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.62%), ఐటీసీ (-0.44%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.42%). మార్కెట్ ట్రెండ్‌లపై దృష్టి
రియాల్టీ మరియు ఫార్మా రంగాలలో బలమైన కొనుగోళ్ల దృష్ట్యా పాజిటివ్ ట్రెండ్.
డాలరు బలపడటం, ఫెడ్ పాలసీ అంచనాలు, ఆంతర్రాష్ట్ర రాజకీయాలు వంటి అంశాలు మార్కెట్‌కి ప్రభావితం చేయగలవు. తాజా మార్కెట్ ట్రెండ్ ప్రకారం, వరుసగా మూడు సెషన్ల నష్టాల అనంతరం ఈరోజు మార్కెట్లు పునరుద్ధరణ కనిపించాయి. ముఖ్యంగా రియాల్టీ మరియు ఫార్మా రంగాలు లాభాలకు ప్రధాన కారణమయ్యాయి.
Read Also: Bharath Pakistan: భారత్-పాకిస్తాన్ సీజ్‌ఫైర్: జవాబు దొరకని కొన్ని ప్రశ్నలు