దేశీయ మార్కెట్లు (Stock market) ఈ వారం ఊగిసలాటలోనే కొనసాగుతున్నాయి. లాభాల్లో ప్రారంభమవుతూ ఆఖర్లో నష్టాల్లోకి జారుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ శుక్రవారం (Stock market) సూచీలు ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 27 పాయింట్ల లాభంతో 83,269 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 8.6 పాయింట్ల లాభంతో 25,413 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.36 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారత్ ఎలక్ట్రానిక్స్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు

లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, టాటాస్టీల్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మారుతీ సుజుకీ స్టాక్స్ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గురువారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్ సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Tech Company: టెక్ కంపెనీలో భారీగా పెరుగుతున్న ఉద్యోగాల కొరత