हिन्दी | Epaper

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

Shobha Rani
Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్‌ స్టాక్స్‌ అండతో సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభపడ్డాయి. ఈయూతో వాణిజ్య చర్చల గడువును జులై 9 వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో 50 శాతం టారిఫ్‌ల అమలు వాయిదా పడింది. తాత్కాలికంగా అనిశ్చితులు చల్లారడంతో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ రాణించాయి. నిఫ్టీ 25 వేల మార్కు ఎగువన ముగిసింది.

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

సెన్సెక్స్‌ ఉదయం 81,928.95 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరును కొనసాగించింది. ఇంట్రాడేలో 82,492.24 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 455.37 పాయింట్ల లాభంతో 82,176.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,001 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరు(dollor)తో రూపాయి మారకం విలువ 35 పైసలు బలపడి 85.10గా ఉంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎటర్నల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 64.75 డాలర్లు వద్ద కొనసాగగా.. బంగారం (Gold) ఔన్సు 3,332 డాలర్ల వద్ద ట్రేడయింది.

Read Also: LIC : 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వంట గ్యాస్ కొరతతో పెరిగిన ఫుడ్ ఐటెమ్స్ ధరలు

వంట గ్యాస్ కొరతతో పెరిగిన ఫుడ్ ఐటెమ్స్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వాటర్ బాటిల్స్ ధరలు!

వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వాటర్ బాటిల్స్ ధరలు!

ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం: రేపటి నుంచే అదనపు చార్జీలు

ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం: రేపటి నుంచే అదనపు చార్జీలు

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై సిగ్మా పట్టు

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై సిగ్మా పట్టు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

📢 For Advertisement Booking: 98481 12870