జగన్ అధినేతలతో భేటీ:
వైసీపీ అధినేత జగన్ వివిధ జిల్లాల నేతలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు భరోసా ఇస్తూ కీలక ప్రకటన చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని, పార్టీకి అహర్నిశలు శ్రమించే కార్యకర్తల సంక్షేమం తన బాధ్యత అని స్పష్టం చేశారు.

కార్యకర్తల సేవలు:
జగన్ మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు తమ జీవితాలను పార్టీ విజయానికి అంకితం చేస్తున్నారని, వారి సేవలను మరచిపోమని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విశదీకరించాలని సూచించారు.
సంక్షేమ పథకాల అమలులో:
సర్కారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా చూడటం కార్యకర్తల బాధ్యతగా జగన్ తెలిపారు. గ్రామ, పట్టణ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు పరిచయం చేయడంలో కార్యకర్తలు ముందుండాలన్నారు.
అన్నివేళలా మీకు అండగా ఉంటాం:
పార్టీకి అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా వెనుకాడొద్దని, పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటుందని హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి, ఇంటింటికి వెళ్లే పరిస్థితి లేదని జగన్ అన్నారు మేము ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి చిన్నపెద్ద పిల్లలని కలిసి వారి పరిస్థితులను తెల్సుకునేవారమని అయన చెప్పారు. ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవేం జరగడం లేదు అని చెప్పారు.
బాబు షూరిటీ-మోసం:
ఇప్పుడు కేవలం దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప మరేమీ లేదని విమర్శించారు. యథేచ్ఛగా పేకాట క్లబ్ లు నడుస్తున్నాయని, ఇసుక, లిక్కర్ స్కాంలు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించేవారిని, అన్యాయాలు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని 10 శాతం ఓట్లు తగ్గడానికి కారణం తాను వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పకపోవడమేనని అన్నారు. ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే ప్రజలను మోసం చేసి, ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంలోని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమేనని, అందరూ కూడా దైర్యంగా ఉండాలని అయన సమావేశంలో చెప్పారు.