IPL 2025:పంజాబ్‌పై ఎస్ ఆర్ హెచ్ ఘనవిజయం

IPL 2025:పంజాబ్‌పై ఎస్ ఆర్ హెచ్ ఘనవిజయం

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో, శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్‌ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 247/2 స్కోరు చేసింది. అభిషేక్‌శర్మ(55 బంతుల్లో 141, 14ఫోర్లు, 10 సిక్స్‌లు) సూపర్‌ సెంచరీతో కదంతొక్కాడు. అభిషేక్‌కు తోడు హెడ్‌(66) జత కలువడంతో రైజర్స్‌ గెలుపు నల్లేరుపై నడక అయ్యింది. అర్ష్‌దీప్‌సింగ్‌, చాహల్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది. తొలుత శ్రేయాస్‌ అయ్యర్‌(36 బంతుల్లో 82, 6ఫోర్లు, 6సిక్స్‌లు) అర్ధసెంచరీతో పంజాబ్‌ 20 ఓవర్లలో 245/6 స్కోరు చేసింది. హర్షల్‌(4/42) నాలుగు వికెట్లు తీశాడు. అభిషేక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఓవరాల్‌గా ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యుత్తమ ఛేదనగా హైదరాబాద్‌, పంజాబ్‌ పోరు నిలిచింది.

Advertisements

ఓపెనర్‌

పంజాబ్‌ నిర్దేశించిన 246 పరుగుల భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌కు అభిషేక్‌ ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. హెడ్‌ను అండగా చేసుకుంటూ అభిషేక్‌..విధ్వంస రచనకు శ్రీకారం చుట్టాడు. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టొయినిస్‌ ఇచ్చిన లైఫ్‌ను వినియోగించుకున్న శర్మ..యాన్సెన్‌ను హ్యాట్రిక్‌ ఫోర్లతో అరుసుకున్నాడు. పొదుపుగా బౌలింగ్‌ చేసే అర్ష్‌దీప్‌సింగ్‌ను లక్ష్యంగా చేసుకున్న హెడ్‌ మూడు ఫోర్లు కొట్టడంతో మూడో ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. ఓవైపు అభిషేక్‌, మరోవైపు హెడ్‌ దంచుడుతో పంజాబ్‌ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. వీరి జోరుకు అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్‌ కెప్టెన్‌ అయ్యర్‌ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. 20 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్న అభిషేక్‌ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించుకుంటూ పోయాడు. దూకుడు ప్రదర్శించిన అభిషేక్‌ మరో 20 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. 100 పరుగులకు చేరుకోగానే తన జేబులో నుంచి చిట్టి తీస్తూ సంబురాలు చేసుకున్నాడు. హెడ్‌ ఔటైనా ఎక్కడా జోరు తగ్గించని శర్మ..తన కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు అందుకుని అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో క్లాసెన్‌(21 నాటౌట్‌), ఇషాన్‌కిషన్‌(9 నాటౌట్‌) మరో 9 బంతులు మిగిలుండగానే గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.

 IPL 2025:పంజాబ్‌పై  ఎస్ ఆర్ హెచ్  ఘనవిజయం
Abhishek Sharma

హర్షల్‌ బౌలింగ్‌

మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన షమీని ఆర్య 6,6,4 దంచగా, ప్రభ్‌సిమ్రన్‌ మరో సిక్స్‌ కొట్టాడు. ఇలా ఇద్దరు వంతులు వేసుకుంటూ మరీ బౌండరీలు బాదడంతో మూడు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ 50 పరుగుల మార్క్‌ అందుకుంది. ఇన్నింగ్స్‌ దూసుకెళుతున్న తరుణంలో హర్షల్‌ బౌలింగ్‌లో ఆర్య(36) తొలి వికెట్‌గా ఔట్‌ కావడంతో 66 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. ఆ తర్వాత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ప్రభ్‌సిమ్రన్‌కు జతకలిశాడు. ఈ మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఇషాన్‌ మలింగ 7వ ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మలింగ 9వ ఓవర్‌లో అయ్యర్‌ రెండు కండ్లు చెదిరే సిక్స్‌లతో ఇన్నింగ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నేహాల్‌ను అండగా చేసుకుంటూ జీషాన్‌ 12వ ఓవర్‌లో అయ్యర్‌ రెండు భారీ సిక్స్‌లకు తోడు ఫోర్‌తో చెలరేగడంతో 20 పరుగులు వచ్చి చేరాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 22 బంతుల్లోనే అయ్యర్‌ వేగవంతమైన అర్ధసెంచరీని నమోదు చేసుకున్నాడు.హర్షల్‌ ఈసారి..శశాంక్‌(2),అయ్యర్‌తో పాటు మ్యాక్స్‌వెల్‌(3)ను పెవిలియన్‌ పంపాడు. షమీ ఆఖరి ఓవర్‌లో స్టొయినిస్‌ నాలుగు సిక్స్‌లు

Read Also: IPL 2025 : డేంజర్ జోన్లో CSK, MI

Related Posts
త‌న‌ను ఫ్రాంచైజీ అట్టిపెట్టుకోక‌పోవ‌డంపై స్పందించిన‌ మ్యాక్సీ
rcb

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తో ప్రత్యేక అనుబంధం ఉంది. 2021 నుంచి ఆర్‌సీబీ జట్టులో ప్రాతినిధ్యం Read more

గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు అతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు
Prabowo Subianto

భార‌త 76వ గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌ల‌కు ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా Read more

Jasprit Bumrah : ఆర్సీబీతో ముంబయి ఇండియన్స్ ఢీ…బుమ్రా రీఎంట్రీ
IPL 2024 M48 LSG v MI

ఐపీఎల్ 2025 లో అభిమానులు ఎదురుచూస్తున్న బిగ్ మ్యాచ్ వచ్చింది! ఈరోజు ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నారు. వేదికగా ముంబయిలోని వాంఖెడే స్టేడియం మెరుస్తోంది. Read more

SSC Exam: ఇక పై పదో తరగతి పరీక్షలన్నిటికి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి
SSC Exam: ఇక పై పదో తరగతి పరీక్షలన్నిటికి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి

SSC నియామక పరీక్షల్లో కొత్త విధానం: మే 2025 నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా తీసుకున్న కీలక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×