నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు బద్దలు కొట్టిన దక్షిణ కొరియా,‘స్క్విడ్ గేమ్'(Squid Game) చివరి సీజన్ మరో 13 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్(Netflix) లో రాబోతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ చివరి సీజన్ జూన్ 27, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.ఇప్పుడు అభిమానులలో మరింత ఉస్తాహం కలిగిస్తోంది ఈ సిరీస్.ఈ ట్రైలర్ చూస్తుంటే, కథానాయకుడు సియోంగ్ గీ-హున్ (లీ జంగ్-జే) ఈ ప్రాణాంతక ఆటకు ఎలా ముగింపు పలుకుతాడు,
చివరి సీజన్
అలాగే ఈ గేమ్ వెనుక ఉన్న ఫ్రంట్ మ్యాన్‌ను కనిపెట్టాడా లేదా అనే అంశాలు ఈ సీజన్‌లో ప్రధానంగా చూపించనున్నారని స్పష్టమవుతోంది. మొదటి రెండు సీజన్(2 Seasons) లలో భారీ విజయాన్ని సాధించిన ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, తెలుగుతో పాటు అనేక భారతీయ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ చివరి సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌కు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించారు.
Read Also: Alappuzha Gymkhana Movie: అలప్పుళ జింఖానా (సోనీ లైవ్) రివ్యూ