పాకిస్థాన్(Pakistan)కు గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై పంజాబ్‌లో మరో యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘జాన్ మహల్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న జస్బీర్ సింగ్(Jasbir Singh Arrest)ను భద్రతా శాఖ అరెస్టు చేసింది. ఇతడి ఛానెల్‌కు 1.1 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అనేక అంశాలను చర్చకు తీసుకొచ్చే జస్బీర్ ఆన్‌లైన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూట్యూబర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.
జ్యోతి మల్హోత్రా కేసులో అతనికి సంబంధాలు
అయితే ఇటీవల పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో అతనికి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. జ్యోతి అరెస్టయ్యాక తన మొబైల్ నుంచి కీలక సమాచారం డిలీట్ చేసేందుకు జస్బీర్ ప్రయత్నించినట్లు సమాచారం. అంతేకాక, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకి సమాచారం అందిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీర్ అలియాస్ జుట్ రాంధావాతో కూడా జస్బీర్‌కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పాకిస్థాన్‌కు సంబంధించి కీలక సమాచారం
జస్బీర్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని రూపనగర్ జిల్లా మహలాన్ గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్‌కు సంబంధించి కీలక సమాచారం వెలికితీసి, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తరించేందుకు ప్రయత్నించాడన్న అభియోగాలపై కేసు నమోదు చేసి, మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో యూట్యూబ్ వంటి వేదికల్ని గూఢచర్యానికి వాడుకుంటున్న ముఠాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also : TTD: లడ్డూ కేసులో వెలుగులో కీలక అంశాలు