2025లో జరగనున్న మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌కు సమయం దగ్గరపడుతుండటంతో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh), జట్టుకు మానసికంగా ప్రోత్సాహం ఇచ్చేలా ముందుకు వచ్చారు. ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చెప్పుతూ, 2011లో భారత్ గెలిచిన వరల్డ్ కప్ అనుభవాలను పంచుకున్నారు.

“టీవీ, పేపర్ దూరం పెట్టండి – కేవలం ఆటపైనే దృష్టి పెట్టండి”
సోమవారం ముంబై(Mumbai)లో జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో యువరాజ్ సింగ్(Yuvraj Singh), జై షా మరియు మిథాలీ రాజ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన యువరాజ్, “2011లో మేం కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాం. అప్పుడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మాకు స్పష్టమైన సలహాలు ఇచ్చారు – టీవీ చూడొద్దు, పత్రికలు చదవొద్దు, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని బయట ప్రపంచాన్ని దూరం పెట్టండి,” అని గుర్తుచేశారు.
“ఆ సలహాలే మమ్మల్ని కప్ దాకా తీసుకెళ్లాయి”
అనవసర విమర్శలు, ప్రజల అంచనాలు జట్టుపై తీవ్ర ఒత్తిడిని కలిగించాయని చెప్పిన యువరాజ్, “ఆ సమయంలో మేము సౌతాఫ్రికాతో ఓడిపోవడంతో ఊహించని విమర్శలు వచ్చాయి. కానీ సచిన్, గ్యారీ మాటలు మాకు ధైర్యం ఇచ్చాయి. ఆటపైనే దృష్టి పెట్టడం వల్లే మేము ఆ ప్రెజర్‌ను దాటి విజయం సాధించగలిగాం,” అన్నారు.
2025 మహిళల వరల్డ్ కప్: చరిత్ర సృష్టించాలన్న లక్ష్యం
ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభమవుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత జట్టు శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటివరకు భారత్ మహిళల జట్టు ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌ను గెలవలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో ఈసారి సొంతగడ్డపై తొలిసారి టైటిల్ గెలవాలన్న దీక్షతో బరిలోకి దిగుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: