ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఫైనల్ అత్యంత రసవత్తరంగా సాగిన మ్యాచ్ అయినా, దాని ముగింపులో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు అభిమానుల్లో నిరాశను కలిగించింది. ఆర్టీసీబీతో జరిగిన ఫైనల్లో కేవలం 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడంతో, 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేరిన పంజాబ్ ఐపీఎల్ టైటిల్ కోల్పోయింది.ఈ నేపథ్యంలో,పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్(Yograj Singh) ఘాటైన విమర్శలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఓ క్రిమినల్ అంటూ మండిపడ్డాడు. అతని వల్లే పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైందని అసహనం వ్యక్తం చేశాడు.
భారత్‌లో ఇద్దరే గొప్ప ఫినిషర్లు
191 పరుగుల లక్ష్యచేధనలో శ్రేయస్ అయ్యర్(1) తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో శశాంక్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) బాధ్యతాయుతంగా ఆడి ఉంటే పంజాబ్ విజయం సాధించేదని యోగ్‌రాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత రాణించే ఆటగాళ్లు లేరని తెలిపాడు. భారత్‌లో యువరాజ్ సింగ్, ధోనీలను మించిన గొప్ప ఫినిషర్లు లేరని చెప్పుకొచ్చాడు.’ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఒక్క క్రిమినల్ ఉన్నాడు. అది పంజాబ్ కింగ్స్(Punjab Kings) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.
అతను ఎప్పుడు ఆడినా పంజాబ్ కింగ్స్ గెలిచింది. అతని తర్వాత రాణించే ఆటగాళ్లు ఎవరూ లేరు. ఆట కంటే ఎవరూ గొప్పవారు కాదు. భారత్‌లో ఇద్దరే గొప్ప ఫినిషర్లు ఉన్నారు. ధోని, యువరాజ్ సింగ్ మాత్రమే ఈ దేశంలో గొప్ప ఫినిషర్లు. ఈ ఇద్దరి గెలుపు శాతం 92. యువరాజ్ సింగ్ గెలుపు శాతం 98. యువరాజ్ సింగ్ 72 మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు.ఈ విజయాలనే అతన్ని గొప్ప ఆటగాడిగా నిలబెట్టాయి.

ఏం జరిగిందనేది
శ్రేయస్ అయ్యర్ ఒకటి చెప్పు నువ్వే పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లావ్. నువ్వు మెరుగైన ప్రదర్శన చేసినప్పుడల్లా జట్టు గెలిచింది. ఫైనల్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) 40 పరుగులే చేశాడు. కానీ అవి 80 పరుగులుగా మారాయి. ఒక్కడి వల్లే పంజాబ్ ఓడింది. ఆ ఒక్కడు శ్రేయస్ అయ్యర్. నాకు కోపం ఎక్కువ. నిన్న ఏం జరిగిందనేది ఎవరూ చూడరు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు ఏం జరుగుతుందో అదే చర్చనీయాంశమవుతుంది.’అని ఓ న్యూస్ ఏజెన్సీతో యోగ్‌రాజ్ అన్నాడు.
Read Also: Bengaluru Stampede:మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం సిద్దరామయ్య