हिन्दी | Epaper
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

WPL 2026: ముంబై ఇండియన్స్ పై యూపీ ఘన విజయం

Aanusha
WPL 2026: ముంబై ఇండియన్స్ పై యూపీ ఘన విజయం

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ జట్టు ముంబయి ఇండియన్స్‌పై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌లో కెప్టెన్ మెగ్ లానింగ్ (70), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (61) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, అనంతరం బౌలర్లు కట్టుదిట్టంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ముంబై జట్టులో అమేలియా కెర్, అమన్‌జోత్ కౌర్ చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Read Also: U19World Cup: టాస్ ఓడిన భారత్

కీలక పాత్ర

ఛేదనలో ముంబై టాప్ ఆర్డర్ విఫలమవడంతో 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అమేలియా కెర్ (28 బంతుల్లో 49 నాటౌట్), అమన్‌జోత్ కౌర్ (24 బంతుల్లో 41) ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించి పోరాడారు. అయితే, వీరిద్దరి పోరాటం జట్టును గెలిపించడానికి సరిపోలేదు. యూపీ బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు సమష్టిగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.

WPL 2026: UP registers a resounding victory over Mumbai Indians
WPL 2026: UP registers a resounding victory over Mumbai Indians

దీంతో బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కిరణ్ నవగిరె (0) డకౌట్ అయినా, కెప్టెన్ మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ ముంబై బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ రెండో వికెట్‌కు 119 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. లానింగ్ 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, లిచ్‌ఫీల్డ్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ మూడు వికెట్లు పడగొట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870