భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ (Abhishek Nair) ఇప్పుడు మరో క్రేజీ ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను మూడో టైటిల్ దిశగా నడిపిన ఈ టాలెంటెడ్ కోచ్, ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) వేదికపై తన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.మహిళల ప్రీమియర్ లీగ్ జట్టు యూపీ వారియర్స్ అతడిని తమ ప్రధాన కోచ్‌గా నియమించింది. గత మూడు సీజన్లు హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన జాన్ లెవిస్ స్థానంలో నాయర్‌కు ఈ బాధ్యత అప్పగించారు. ఈ విషయాన్ని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే జట్టుతో అనుబంధం ఉన్న నాయర్
రెండేళ్ల క్రితం యూపీ వారియర్స్ ప్లేయర్లతో పనిచేశాను. బెంగళూరులో వారికి సూచనలు ఇచ్చాను. కానీ ఈసారి బాధ్యతే వేరు. హెడ్‌కోచ్‌గా వచ్చాను. మహిళల క్రికెట్‌కు ఇది గోల్డెన్ టైం. మా స్క్వాడ్ టాలెంట్‌తో నిండిపోవాలి, అంటూ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.గతేడాది గౌతం గంభీర్ టీంలో టీమ్ ఇండియాకు అసిస్టెంట్ కోచ్‌గా అవకాశం వచ్చిన నాయర్, అకస్మాత్తుగా ఆ బాధ్యతను కోల్పోయాడు. దాంతో మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ క్యాంపులోకి అడుగుపెట్టాడు. అయితే, ఐపీఎల్ 18వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా ఫలితాల్లో మాత్రం నిరాశపరిచింది.
తొమ్మిదింటే విజయాలు
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ నుంచే బరిలోకి దిగిన యూపీ వారియర్స్ ఇప్పటివరకు 25 మ్యాచ్‌ల్లో కేవలం తొమ్మిదింట్లోనే విజయం సాధించింది. మొదటి సీజన్‌లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్లినప్పటికీ, ముంబయి చేతిలో ఓడిపోయింది. రెండో సీజన్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలోనే నాయర్‌కు తలుపులు తెరిచిన యాజమాన్యం, అతడి వ్యూహాలు జట్టును కొత్త శకం వైపు నడిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. టాలెంట్ స్కౌటింగ్‌లోనూ, టీమ్ నిర్మాణంలోనూ నాయర్‌కు విస్తృత అనుభవం ఉండటం అతని ప్లస్ పాయింట్. ఈసారి మాత్రం యూపీ జట్టు ట్రోఫీ సాధించాలని గట్టిగా పట్టుదలగా ఉంది.
Read Also : Women World Cup 2025: ప్రపంచకప్ ఫైనల్లో తలపడనున్న కోనేరు హంపి..దేశ్‌ముఖ్