ఐపీఎల్ 2025 సీజన్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.14 ఏళ్లకే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు. తన ఐపీఎల్ అరంగేట్రం తొలి బంతికే సిక్స్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి మ్యాచ్‌లో వైభవ్ 20 బంతుల్లో 34 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంత చిన్న వయస్సులోనే తన ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వైభవ్ సూర్యవంశీకి కీలక సలహా ఇచ్చాడు. తొలి విజయంతోనే తాను సంతోషంగా ఉంటే వచ్చే ఏడాది తాను ఆడటం కనిపించకపోవచ్చని అన్నాడు. వైభవ్ సూర్యవంశీ స్థిరంగా ఉండి ఎక్కువ కాలం ఆడాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు.రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ను వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్‌లో విశ్లేషించారు. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ విరాట్ కోహ్లీ లాగా సుదీర్ఘ కెరీర్‌ను నిర్మించడంపై దృష్టి పెట్టాలని సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. “వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో 20 సంవత్సరాలు ఆడాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. విరాట్ కోహ్లీని చూడండి. విరాట్ 19 ఏళ్ల వయస్సులో ఆడడం ప్రారంభించాడు. ఇప్పుడు కోహ్లీ 18 సీజన్లు ఆడాడు. వైభవ్ దీన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. కానీ అతను ఈ ఐపీఎల్‌తో సంతోషంగా ఉండి ఇప్పుడు తాను కోటీశ్వరుడిని అని అనుకుంటే బహుశా మనం అతడిని వచ్చే ఏడాది చూడకపోవచ్చు. మొత్తానికి అతని అరంగేట్రం చాలా బాగుంది. మొదటి బంతికే సిక్స్ కొట్టాడు.” అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
స్టార్ ప్లేయర్
ఓపిక పట్టాలని వైభవ్ సూర్యవంశీని సెహ్వాగ్ హెచ్చరించాడు. వైభవ్ బాగా రాణించడంపై దృష్టి పెట్టాలన్నారు. క్రికెట్ విషయానికి వస్తే బాగా ఆడినప్పుడు ప్రశంసలు వస్తాయని,పేలవంగా ఆడినప్పుడు విమర్శలు తలెత్తుతాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. క్రికెటర్లు సమతుల్యంగా ఉండడానికి ఇదే మార్గం అన్నాడు. కొంత మంది క్రికెటర్లు ఐపీఎల్ సిరీస్‌లో 1 లేదా 2 మ్యాచ్‌లు ఆడిన తర్వాత అత్యున్నత కీర్తికి చేరుకుంటారని, అప్పుడు వారు స్టార్ ప్లేయర్‌లు అయ్యారని భావించి ఏమీ చేయరు” అని సెహ్వాగ్ చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ కూడా తనను తాను స్టార్ గా భావించకూడదని క్రికెట్ పై దృష్టి పెట్టాలని చెప్పాడు.

కెరీర్
వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. వైభవ్ కంటే ముందు ఈ రికార్డు ప్రేయాస్ రే బర్మాన్ పేరిట నమోదైంది. అతను 2019 సంవత్సరంలో 16 సంవత్సరాల 157 రోజుల వయస్సులో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉండగా వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన కెరీర్‌లోని మొదటి బంతికే సిక్స్ కొట్టిన 10వ బ్యాటర్ గా నిలిచాడు. ఐపీఎల్‌లో తన తొలి బంతికే వైభవ్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతికే భారీ సిక్స్ కొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.వైభవ్ పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎవరైతే వైభవ్ స్కూల్ గురించి ట్రోల్ చేశారో వాళ్లు ఇప్పుడు 9వ తరగతిలో ఉన్నారు. కానీ అతను ఈ రోజు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడని కామెంట్లు చేస్తున్నారు.
Read Also: CSK : సీఎస్కే జట్టు ను వీడనున్న పతిరానా!