టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. కోహ్లీ క్రికెట్‌లో చూపిన ప్రతిభతోపాటు, అతని ఆటతీరుతోనే కాకుండా మైదానం బయట కూడా ఎంతగానో ప్రభావం చూపుతున్నాడని పేర్కొన్నారు. “కోహ్లీ అభిమానులకు ఆయన మాటే శాసనం. కోహ్లీ చెప్పినదే వాళ్లకు ధర్మం లాంటి విషయం” అని సెహ్వాగ్ (Sehwag) వ్యాఖ్యానించారు. మరే ఆటగాడు కూడా ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోలేదని, కోహ్లీ ఏది చెబితే తన అభిమానులు అది చేస్తారని తెలిపాడు. ఇందుకు రెండు సంఘటనలను ఉదహారణగా పేర్కొన్నాడు. నిషేధం తర్వాత స్టీవ్ స్మిత్ (Steve Smith) రీఎంట్రీ ఇచ్చినప్పుడు అతన్ని అభిమానులు గేలి చేస్తుంటే కోహ్లీ అడ్డుకున్నాడని గుర్తు చేశాడు. అలాగే అఫ్గానిస్థాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ విషయంలో ఇలానే జరిగిందని చెప్పాడు.
హేళన చేస్తుంటే కోహ్లీ అడ్డుకున్నాడు
విరాట్ కోహ్లీ మాటలకు అభిమానులు విలువ ఇస్తారు. వారికి అతని మాటే శాసనం. కోహ్లీ ఏది చెప్పినా పాటిస్తారు. స్టీవ్ స్మిత్ నిషేధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అభిమానులు ఛీటర్ అంటూ హేళన చేస్తుంటే కోహ్లీ అడ్డుకున్నాడు. స్మిత్‌ను హేళన చేయవద్దని, ఎంకరేజ్ చేయాలని సూచించాడు. ఈ ఘటన అందరికి గుర్తే ఉండి ఉంటుంది. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా కూడా నవీన్ ఉల్ హక్ విషయంలో కూడా ఇలానే జరిగింది. నవీన్ ఉల్ హక్‌ను అభిమానులు గేలి చేస్తుండగా కోహ్లీ అడ్డకున్నాడు. గేలి చేయకుండా ఎంకరేజ్ (Encourage) చేయాలని చెప్పాడు. ఈ రెండు సందర్భాల్లో కోహ్లీ సూచనలను ఫ్యాన్స్ పాటించారు.’అని ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

క్రికెట్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా
టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో గడుపుతున్నాడు. టీ20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన కోహ్లీ, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ (Virat Kohli) 68 టెస్ట్‌ల్లో 40 విజయాలు అందించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. గతేడాది కోహ్లీ తీవ్రంగా తడబడ్డాడు. 22.47 సగటుతోనే పరుగులు చేశాడు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్ట్ ఆడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mohammed Siraj: ఎడ్జ్‌బాస్టన్ లో చెలరేగిన సిరాజ్.. ఈ 6 వికెట్లే బుమ్రా తీసి ఉంటే?