టీమిండియా మాజీ కెప్టెన్, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆటగాడు విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ,ఉంటాడు. అయితే ఈసారి ఆయన క్రికెట్ ఆటగాడిగా కాకుండా, అతని లుక్ కారణంగా వైరల్ అయ్యాడు. లండన్‌లో తీసిన ఒక తాజా ఫొటోలో విరాట్ కోహ్లీ (Virat Kohli) పూర్తిగా నెరిసిన గడ్డంతో కనిపించడంతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.అయితే ఈ ఫోటో మాత్రమే కాదు… దానికి అనుబంధంగా వచ్చే ఊహాగానాలే ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. కోహ్లీ వన్డే క్రికెట్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారేమో అనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ (Test cricket) కి వీడ్కోలు పలికిన కోహ్లీ, తన లుక్‌లో వచ్చిన ఈ డ్రమాటిక్ మార్పు, వయసుతో పాటు మానసికంగా కూడా క్రికెట్‌కు దూరంగా ఉన్నట్టుగా చూపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు.
రంగు వేయాల్సి వస్తోందంటే సమయం దగ్గరపడిందని
వన్డే రిటైర్మెంట్ లోడింగ్? అంటూ ఎంతోమంది మీమ్స్, పోస్టులు షేర్ చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోహ్లీ (Kohli) ఓ కార్యక్రమంలో తన గడ్డం గురించి సరదాగా మాట్లాడుతూ, “రెండు రోజుల క్రితమే గడ్డానికి రంగు వేసుకున్నా. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి గడ్డానికి రంగు వేయాల్సి వస్తోందంటే సమయం దగ్గరపడిందని అర్థం చేసుకోవాలి” అని వ్యాఖ్యానించారు. అప్పుడు సరదాగా అన్న మాటలను ఇప్పుడు అభిమానులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.కోహ్లీ శారీరకంగా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ, ఆయన తాజా రూపం మాత్రం రిటైర్మెంట్‌పై చర్చను మరింత పెంచింది. అయితే, తన వన్డే కెరీర్ భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆయన తదుపరి నిర్ణయం కోసం క్రికెట్ ప్రపంచం, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
విరాట్ కోహ్లీ జన్మస్థలం ఎక్కడ?
విరాట్ కోహ్లీ 1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఎన్ని వన్డే శతకాలు సాధించాడు?
విరాట్ కోహ్లీ 50కు పైగా వన్డే శతకాలు సాధించాడు, ఇది సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా అధిగమించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: