విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై: ఊహించని రిటైర్మెంట్ వెనుక రాజకీయాలు?
భారత క్రికెట్ అభిమానులకు గట్టి షాక్ ఇచ్చేలా టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 14 సంవత్సరాల పాటు భారత టెస్ట్ జట్టుకు సేవలందించిన కోహ్లీ తన ఆఖరి మ్యాచ్ ఆడి మౌనంగా గుడ్‌బై చెప్పేశాడు. సుదీర్ఘంగా క్రికెట్‌కు చేసిన సేవల తర్వాత అతని ఈ నిర్ణయం సహజంగా తీసుకున్నదేనా? లేక దీని వెనుక లోతైన కారణాలున్నాయా? అన్న అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా, ఇటీవల కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ రాకతో జట్టులో వస్తున్న మార్పులు, మారిన వాతావరణం ఈ రిటైర్మెంట్‌ను ప్రేరేపించిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అభిమానులు ఈ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కోహ్లీ ఇప్పటికీ అద్భుత ఫిట్‌నెస్, మెరుగైన ఫామ్‌ను కలిగి ఉండి ఐపీఎల్‌లోనూ (IPL) రాణిస్తున్న సమయంలో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యకరం.

గంభీర్ కోచ్ అయ్యాక ఊహించని మార్పులు
గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన తర్వాత జట్టులో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కోహ్లీ, రోహిత్ (Kohli, Rohit) శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ (Retirement) ప్రకటనలు వేగంగా వెలువడుతుండటంతో గంభీర్ తీరుపై నెటిజన్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో టీమిండియాకు విజయాలు అందించిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకేసారి ఆటకు వీడ్కోలు పలకడం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? బీసీసీఐ వారి రిటైర్మెంట్‌ను అంగీకరించలేదని, కానీ వారు మొండి నిర్ణయం తీసుకున్నారని వచ్చిన వార్తలు మిశ్రమ స్పందనకు దారి తీస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే కోహ్లీ బీసీసీఐకి రిటైర్మెంట్ విషయాన్ని తెలియజేశాడని, బోర్డు అతన్ని నిలిపే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయిందని సమాచారం.
ఫిట్‌నెస్, ఫామ్ ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ఎందుకు?
ఐపీఎల్ 2025లో ఇప్పటికే 500కి పైగా పరుగులు చేసిన కోహ్లీ, తన ఫిట్‌నెస్‌తో యువ క్రికెటర్లకు సవాల్ విసురుతున్నాడు. చిన్న గ్రౌండ్లలో నాలుగు రన్స్ ఉరికేంత వేగంగా పరుగులు తీస్తున్న అతని స్థాయి చూస్తే.. రిటైర్మెంట్ అనే పదం అతని గురించి ఊహించలేం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్‌లో, అంతర్జాతీయ టీ20 ఫామ్‌లో ఉన్న సమయంలో రిటైర్మెంట్ ప్రకటించడాన్ని క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. టెస్టుల్లో ఇంకా నాలుగైదేళ్లు ఆడగల సామర్థ్యం ఉన్న కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అంతర్గత రాజకీయాలే కారణమా?

ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు తర్వాత గంభీర్ అహంకారం?
ఒకదశలో కోచ్‌గా గంభీర్ విజయవంతంగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించినా, ఇతర సిరీస్‌ల్లో ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. బార్డర్-గావస్కర్ ట్రోఫీలో ఓటమి, న్యూజిలాండ్‌తో హోం టెస్టుల్లో వైట్‌వాష్, శ్రీలంకతో వన్డే సిరీస్ పరాజయం ఇలా వరుస అపజయాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ గంభీర్‌లో వచ్చిన మార్పులు, ఆటగాళ్లపై పెరిగిన నియంత్రణకు అతన్ని కేంద్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్, కోహ్లీ వంటి సీనియర్లను పక్కకు నెట్టేసి యువతకు అవకాశాలు కల్పించాలన్న అతని తత్వం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అభిమానులు అంటున్నారు.
రిటైర్మెంట్ వెనుక అసలు కథ?
ఈ రిటైర్మెంట్‌లు నిజంగా ఆటగాళ్ల స్వచ్ఛంద నిర్ణయమా? లేక కోచ్, బోర్డు మధ్య మారుతున్న రాజకీయ సమీకరణాల ప్రభావమా? అనే కోణంలో ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి. అభిమానులు మాత్రం ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. “ఇంకా మేం కోహ్లీ టెస్టు శతకాలు చూడాలి అనుకున్నాం.. కానీ ఈ నిర్ణయంతో కోహ్లీ శతకాలపై ముగింపు పలికినట్లే..” అంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.
Read also: Virat Kohli: టెస్ట్ మ్యాచ్ లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ