టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. కోహ్లీ రిటైర్మెంట్‌పై అనేక ఊహాగానాలు వెలువడినా అతని నిర్ణయాన్ని గౌరవిస్తూ అభిమానులు, మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షించారు.అది కూడా కీలకమైన ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఈ ఇద్దరు ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం చర్చకు దారితీసింది. ఇదే విషయమై తాజాగా ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అందర్సన్ స్పందించాడు.ముఖ్యంగా కోహ్లీ నిర్ణయం తనకు ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. లాంగ్ ఫార్మాట్‌లో విరాట్ అద్భుతమైన బ్యాటర్ అని అండర్సన్(James Anderson) అన్నాడు. అయితే, అనుభవజ్ఞులైన ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించినా వారి స్థానాన్ని భర్తీ చేయగల అద్భుతమైన నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులైన ఆటగాళ్లు టీమిండియాకు ఉన్నారని తెలిపాడు.

ప్రతిభగల
రోహిత్ శర్మ అద్భుతమైన సారథి. టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. కానీ, త్వరలోనే అతడి స్థానంలో ప్రతిభావంతుడైన మరో కెప్టెన్ వస్తాడు. అలాగే విరాట్ కోహ్లీ గొప్ప బ్యాటర్. అతడి స్థానాన్ని కూడా భర్తీ చేయడానికి భారత్‌లో చాలా మంది అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాళ్లున్నారు. అయితే, విరాట్ ఇలా సడెన్‌గా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.భారత్‌లో ప్రస్తుతం ఐపీఎల్ నుంచి టెస్ట్ క్రికెట్‌లోకి ప్లేయర్లను తీసుకు వస్తున్నారు. అలా వస్తున్న ఆటగాళ్లు నిర్భయంగా, చాలా దూకుడుగా ఆడుతున్నారు. ఇక భారత జట్టులో అపారమైన ప్రతిభగల బ్యాటర్లు, బౌలర్లకు కొదవ లేదు. అందుకే రాబోయే ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా నుంచి ఇంగ్లండ్ జట్టుకు కచ్చితంగా గట్టి సవాళ్లు ఎదురుకావడం ఖాయం” అని అండర్సన్ చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 123 టెస్ట్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ సక్సెస్‌ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్‌లు గెలిచింది. 2016-19 మధ్య కాలంలో కోహ్లీ పరుగుల మోత మోగించాడు. ఈ మూడేళ్లలో అతను 43 టెస్ట్‌ల్లో 66.79 సగటుతో 4,208 రన్స్ చేశాడు. ఆడిన 69 ఇన్నింగ్స్‌లో 16 శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ కాలంలోనే కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాడు.
Read Also: Sports: గిల్,పంత్ ఇద్దరిలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?