T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక వ్యూయర్‌షిప్‌ను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. క్రికెట్ పట్ల భారత అభిమానులకు ఉన్న మక్కువ ఈ గణాంకాల ద్వారా మరోసారి నిరూపితమైంది. కేవలం భారతదేశంలోనే ఈ టోర్నమెంట్‌ను వీక్షించిన వారి సంఖ్య 50 కోట్లు (500 Million) దాటడం విశేషం. ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌కు ఇంతటి భారీ స్థాయిలో ఆదరణ లభించడం ఇదే తొలిసారి.
Read Also: Michael Vaughan: సెమీస్‌లో ఇంగ్లాండ్‌దే విజయం: మాజీ కెప్టెన్
జై షా హర్షం: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త బెంచ్‌మార్క్
ఈ చారిత్రాత్మక విజయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలనే లక్ష్యం దిశగా ఈ టోర్నమెంట్ సాగుతోందని ఆయన పేర్కొన్నారు. కేవలం టీవీల్లోనే కాకుండా డిజిటల్ వేదికలపై కూడా, అభిమానులు విపరీతమైన ఆసక్తి చూపారు. ముఖ్యంగా జియో హాట్‌స్టార్‌లో ఒకేసారి 6.05 కోట్ల మంది (Concurrent Viewers) లైవ్ వీక్షించడం అద్భుతమని పేర్కొన్నారు. నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో భారత అభిమానుల ప్రేమతో మరిన్ని రికార్డులు బద్దలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక, ఐసీసీ అధికారిక స్ట్రీమింగ్ సర్వీస్ ఐసీసీ.టీవీ కూడా కొత్త రికార్డులు సృష్టించింది. 2024 ఎడిషన్‌తో పోలిస్తే వినియోగదారులు 28 శాతం, వీక్షణ సమయం 56 శాతం పెరిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో వ్యూస్ ఇప్పటికే 10 బిలియన్లు దాటాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: