
Arjun Tendulkar: భారత క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, తన స్నేహితురాలు సానియా చందోక్‌ను వివాహమాడారు. గురువారం ముంబైలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అర్జున్ – సానియాలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
Read Also: Abhishek Sharma: “కొంతకాలం విరామం తీసుకో!” అభిషేక్ కు పాంటింగ్ సూచన
తరలివచ్చిన దిగ్గజాలు: ధోనీ, జై షా సందడి
ఈ వివాహ మహోత్సవానికి దేశంలోని క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ ఛైర్మన్ జైషా, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: