Test Clash : ఓవల్‌లో జరుగుతున్న భారత్ – ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్ (India vs England Fifth Test match) ఉత్కంఠభరితంగా సాగుతుండగా, అధికారుల నిర్ణయాలు, గ్రౌండ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వివాదాస్పదంగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయంలో వర్షం కారణంగా ఆట నిలిచిపోగా, వర్షం ఆగిన తర్వాత కూడా మైదానాన్ని సిద్ధం చేయడంలో జాప్యం జరిగింది. దీనిపై భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఘాటు విమర్శలు చేశారు.
వర్షం ఆగినా ఆట ఆలస్యం: అధికారులపై ఆగ్రహం
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు విజయానికి 35 పరుగులు, భారత్‌కు నాలుగు వికెట్లు అవసరమైన కీలక సమయంలో వర్షం ఆటను అడ్డుకుంది. వర్షం ఆగినా, మైదానం సిద్ధం కాకపోవడంతో ఆట తిరిగి ప్రారంభం కాలేదు. అధికారులు, గ్రౌండ్ సిబ్బంది చురుగ్గా వ్యవహరించకపోవడంపై అభిమానులు, వ్యాఖ్యాతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. స్కై స్పోర్ట్స్ వ్యాఖ్యాత నాసిర్ హుస్సేన్, “ప్రేక్షకులు డబ్బు ఖర్చు చేసి టికెట్లు కొన్నారు. వర్షం ఆగిపోయింది, కాబట్టి వెంటనే సూపర్-సాపర్‌ను ఉపయోగించి మైదానాన్ని సిద్ధం చేయాలి” అని అధికారులను ఉద్దేశించి విమర్శించారు. ఈ నిర్లక్ష్యం వల్ల ఉత్కంఠభరిత మ్యాచ్ రసాభాస అయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దినేశ్ కార్తీక్ ఘాటు వ్యాఖ్యలు
దినేశ్ కార్తీక్ (Dinesh karthik) సోషల్ మీడియా వేదిక Xలో అధికారుల తీరును ప్రశ్నించారు. “ఇంత కీలక సమయంలో, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పుడు, నిబంధనల పేరుతో మొండిగా వ్యవహరించడం సరికాదు. ఆటగాళ్ల భద్రతకు ముప్పు లేనప్పుడు కామన్ సెన్స్ ఉపయోగించి ఆటను కొనసాగించాలి” అని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన క్రికెట్ అభిమానులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గ్రౌండ్ సిబ్బంది, అధికారుల నిర్ణయంపై వివాదం
వర్షం ఆగిన 30 నిమిషాల తర్వాత కూడా మైదానం సూర్యకాంతిలో మెరిసిపోతున్నప్పటికీ, అధికారులు ఆటను పునఃప్రారంభించకపోవడంపై ప్రేక్షకులు “డిస్‌గ్రేస్” అంటూ నినాదాలు చేశారు. గ్రౌండ్ సిబ్బంది సమయానికి కవర్లను తొలగించకపోవడం, అవుట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేయడంలో జాప్యం చేయడం విమర్శలకు కారణమైంది. ఈ ఘటన ఈ సిరీస్‌లో ఇప్పటికే ఉన్న ఉద్విగ్న వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేసింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ MORE :