Tejaswin Shankar : చైనాలో భారత జాతీయ గీతం మార్మోగింది. టియాంజిన్ వేదికగా జరుగుతున్న ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026లో భారత అథ్లెట్ Tejaswin Shankar స్వర్ణ పతకం సాధించి దేశానికి తొలి విజయాన్ని అందించారు. పురుషుల హెప్టాథ్లాన్ విభాగంలో తేజస్విన్ మొత్తం 5993 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.
ఏడు విభాగాలుగా జరిగిన ఈ రెండు రోజుల పోటీల్లో తేజస్విన్ అసాధారణ ప్రతిభ ప్రదర్శించారు. 60 మీటర్ల పరుగెత్తు, లాంగ్ జంప్, షాట్‌పుట్, హైజంప్, 60 మీటర్ల హర్డిల్స్, పోల్ వాల్ట్, 1000 మీటర్ల పరుగులో నిలకడగా పాయింట్లు సాధిస్తూ లీడర్‌గా కొనసాగారు. ముఖ్యంగా హైజంప్‌లో ఆయన సాధించిన స్కోరు విజయంలో కీలకంగా మారింది.
Read Also: AP: బర్డ్ ఫ్లూ తో 28 వేల కోళ్లు మృతి

ఈ క్రమంలో తేజస్విన్ తన సొంత జాతీయ రికార్డును తిరగరాస్తూ మరోసారి చరిత్ర సృష్టించారు. 6000 పాయింట్ల మైలురాయికి కేవలం 7 పాయింట్ల దూరంలో నిలిచినప్పటికీ, ఆసియా స్థాయిలో స్వర్ణం సాధించి భారత్‌కు గర్వకారణమయ్యారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన ఏకైక గోల్డ్ మెడల్ ఇదే కావడం విశేషం. చైనాలో త్రివర్ణ పతాకం ఎగరడంతో యావత్ దేశం ఆనందంతో ఉప్పొంగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: