Team India : నేడు షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమవుతోంది.ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు కొనసాగనున్న ఈ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.

వన్డే సిరీస్ షెడ్యూల్:
అక్టోబర్ 19: తొలి వన్డే – పెర్త్
అక్టోబర్ 23: రెండో వన్డే – అడిలైడ్
అక్టోబర్ 25: మూడో వన్డే – సిడ్నీ
టీ20 సిరీస్ షెడ్యూల్:
అక్టోబర్ 29: తొలి టీ20 – కాన్‌బెర్రా
అక్టోబర్ 31: రెండో టీ20 – మెల్‌బోర్న్
నవంబర్ 2: మూడో టీ20 – హోబర్ట్
నవంబర్ 6: నాలుగో టీ20 – గోల్డ్ కోస్ట్
నవంబర్ 8: ఐదో టీ20 – బ్రిస్బేన్
ఈ పర్యటనలో భారత జట్టు ఆసీస్ గడ్డపై తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని పొందనుంది.టీమిండియా ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆసక్తికరమైన మ్యాచ్‌లతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా గ్యారంటీ!