हिन्दी | Epaper

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు సాంగ్ కంపోజ్ చేస్తున్న అనిరుధ్

Tejaswini Y
T20 World Cup: Anirudh is composing a song for the T20 World Cup
T20 World Cup: Anirudh is composing a song for the T20 World Cup

రానున్న టీ20 ప్రపంచకప్‌కు అధికారిక గీతాన్ని ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) స్వరపరచనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీతో తన పేరు అనుసంధానమవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అనిరుధ్ అన్నారు. క్రికెట్ తనకు కేవలం ఒక ఆట మాత్రమే కాదని, కోట్లాది మంది అభిమానుల భావోద్వేగాలతో ముడిపడిన అనుభూతి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచకప్ కోసం పాట అందించే అవకాశం రావడం ప్రత్యేకమైన అనుభవమని పేర్కొంటూ, ఈ గీతాన్ని త్వరలోనే అభిమానుల ముందుకు తీసుకువస్తామని వెల్లడించారు.

Read Also: Team India: పాక్ రికార్డును బద్దలుకొట్టిన భారత్

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా స్వదేశంలో మ్యాచ్‌లు ఆడనుండటంతో టైటిల్‌కు ప్రధాన ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సొంత మైదానాల్లో మరోసారి కప్ సాధించి అభిమానులను ఉత్సాహపరచాలనే లక్ష్యంతో సూర్యసేన కఠినంగా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అనిరుధ్ స్వరపరచనున్న ఉత్సాహభరిత గీతం టోర్నీకి మరింత జోష్‌ను అందించనుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870