2026 టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026) పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచ కప్, లో 300 పరుగుల మార్క్ దాటే అవకాశం ఉందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. ఆస్ట్రేలియా లేదా ఇండియా జట్లలో ఏదో ఒకటి ఈ ఘనత సాధిస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఇరు జట్లలోనూ పవర్ హిట్టర్లు, సమర్థులైన ఆటగాళ్లు ఉన్నారని, టాప్ ఆర్డర్ లో ఒకరు సెంచరీ చేస్తే 300 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవచ్చని శాస్త్రి అభిప్రాయపడ్డారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోర్ 260 పరుగులు (శ్రీలంక vs కెన్యా, 2007). ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలో జరగనుంది.
Read Also: Brian Lara: గంభీర్ నిర్ణయాలు భారత క్రికెట్ కు ప్రమాదకరం

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: