हिन्दी | Epaper

T20 WC: బాయ్‌కాట్‌పై మాట మార్చిన బంగ్లాదేశ్

Anusha
T20 WC: బాయ్‌కాట్‌పై మాట మార్చిన బంగ్లాదేశ్

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 (T20 WC) అంశంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి యూటర్న్ తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముందుగా ఈ టోర్నీలో భారత్‌లో ఆడకూడదనే బాయ్‌కాట్ నిర్ణయం పూర్తిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆటగాళ్లదేనని క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి పాత్ర లేదని ఆయన పేర్కొన్నారు.

Read Also: T20 WC: పాక్ యూటర్న్‌ పై డానిష్ కనేరియా ఏమన్నారంటే?

ఈ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంది

మంగళవారం నాడు ఆసిఫ్ నజ్రుల్ మీడియాతో మాట్లాడుతూ “దేశ గౌరవాన్ని కాపాడేందుకు బీసీబీ, ఆటగాళ్లు ఈ త్యాగం చేశారు. వారే ఈ నిర్ణయం తీసుకున్నారు” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. “ఈ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంది. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ గందరగోళంపై నా వైఫల్యాన్ని అంగీకరిస్తున్నాను” అని నజ్రుల్ తెలిపారు. “ప్రపంచకప్ ఆడకూడదనేది ప్రభుత్వ నిర్ణయమని నేను మరోసారి గట్టిగా చెబుతున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.

T20 WC: Bangladesh changes its mind on boycott
T20 WC: Bangladesh changes its mind on boycott

భారత్‌లో తమకు భద్రతపై ఆందోళనలు ఉన్నాయని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ తొలుత ఐసీసీని కోరింది. ఐసీసీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకున్నారు. అయితే, టోర్నీ నుంచి వైదొలిగినందుకు బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక లేదా ఇతర ఆంక్షలు విధించబోమని ఐసీసీ హామీ ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870