हिन्दी | Epaper

T20 WC 2026: పసికూన చేతిలో టీమిండియా ఘోర పరాజయం

Aanusha
T20 WC 2026: పసికూన చేతిలో టీమిండియా ఘోర పరాజయం

ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌–2026 (T20 WC 2026) టోర్నమెంట్‌లో భారత మహిళల ‘ఎ’ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకాక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పసికూన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) జట్టు చేతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్- ఏ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. అనుష్క శర్మ(45 బంతుల్లో 7 ఫోర్లతో 47), తనూజ కన్వార్(25 బంతుల్లో 5 ఫోర్లతో 34) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ రాధాయాదవ్(7)తీవ్రంగా నిరాశపర్చింది.

Read Also: Winter Olympics: ఒలింపిక్స్‌ లో కండోమ్స్ కొరత

టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుతాయి

యూఏఈ బౌలర్లలో సమైరా ధరింధర్కా(3/40) మూడు వికెట్లు తీయగా.. వైష్ణవే మహేష్(2/13), ఇషా ఓజా(2/30) రెండేసి వికెట్లు పడగొట్టాడు. సురక్ష కొట్టే, అతిగే సిల్వా చెరో వికెట్ తీసారు.అనంతరం యూఏఈ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది.కెప్టెన్ ఇషా ఓజా(61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించింది.సమైరా(31 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) కీలక ఇన్నింగ్స్ ఆడింది.

T20 WC 2026: Team India suffers a crushing defeat at the hands of Pasikoona
T20 WC 2026: Team India suffers a crushing defeat at the hands of Pasikoona

భారత బౌలర్లలో రాధా యాదవ్, ప్రేమ రావత్, తనూజ కన్వార్ తలో వికెట్ తీసారు.భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్(ఆదివారం), నేపాల్‌(మంగళవారం)తో తలపడనుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో తలపడుతుండగా రెండు గ్రూప్స్ విభజించారు. రెండు గ్రూప్స్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుతాయి. భారత్ సెమీఫైనల్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. లేదంటే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

టీమిండియాలోని ప్రతి ప్లేయర్‌తో ప్రమాదమే

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

టీ20 ఫైనల్ ముందు అహ్మదాబాద్ స్టేడియానికి దిష్టి – వీడియో వైరల్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

టీమిండియా ‘లక్కీ గర్ల్’.. ఫైనల్‌కు తీసుకురండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

బుమ్రా ఒక ‘వరల్డ్ క్లాస్ ఆపరేటర్’: కివీస్ క్రికెటర్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ వ్యూయర్‌షిప్ రికార్డ్

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

బుమ్రాకు దక్కని గుర్తింపు? నెట్టింట ఆసక్తికర చర్చ!

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

📢 For Advertisement Booking: 98481 12870