हिन्दी | Epaper

T20 WC 2026: సౌతాఫ్రికా టీంపై మైఖేల్ వాన్ ఫైర్

Anusha
T20 WC 2026: సౌతాఫ్రికా టీంపై మైఖేల్ వాన్ ఫైర్

T20 WC 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలవడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సౌతాఫ్రికా జట్టుపై ఆయన విమర్శలు గుప్పించారు. సూపర్-8లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవకుండా ఓడిపోయి ఉంటే, బలమైన టీమిండియా టోర్నీ నుంచే నిష్క్రమించేదని, కానీ సౌతాఫ్రికా ఆ తెలివి ప్రదర్శించలేకపోయిందని వాన్ అభిప్రాయపడ్డారు.

Read Also: Indian Wells Women’s Final: ఇండియన్ వెల్స్ ఫైనల్‌లో సబలెంకా vs రైబాకినా

అత్యంత తెలివి తక్కువ జట్టు ఏదైనా ఉందా? అంటే అది సౌతాఫ్రికానే

ఎయిడెన్ మార్క్‌రమ్ నాయకత్వంలోని సౌతాఫ్రికా.. అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్ చేరింది. కానీ కీలక సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన మైఖేల్ వాన్.. సౌతాఫ్రికా టీమ్‌పై విమర్శలు గుప్పించాడు.’ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత తెలివి తక్కువ జట్టు ఏదైనా ఉందా? అంటే అది సౌతాఫ్రికానే.

T20 WC 2026: Michael van Fire in South Africa's team
T20 WC 2026: Michael van Fire in South Africa’s team

ఎందుకంటే సూపర్-8 పోరులో వెస్టిండీస్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయి ఉంటే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించేది. కానీ ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచి భారత్ ప్రపంచకప్‌లో కొనసాగేందుకు అవకాశం కల్పించారు. తర్వాత టీమిండియా.. జింబాబ్వే, వెస్టిండీస్‌లపై విజయం సాధించి సెమీఫైనల్ చేరింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇలాంటివి జరగకూడదు. సాధారణంగా జరగవు కూడా. కానీ.. ప్రపంచకప్ గెలవాలంటే ఉత్తమ జట్టును త్వరగా టోర్నీ నుంచి బయటకు పంపాలి.’అని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870