हिन्दी | Epaper

T20 WC 2026: చివరి లీగ్ మ్యాచ్ లో కెనడా పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం

Aanusha
T20 WC 2026: చివరి లీగ్ మ్యాచ్ లో కెనడా పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం

T20 WC 2026: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెనడాపై ఘన విజయం సాధించింది.చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెనడా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

Read Also: T20 World Cup 2026: ఇటలీపై వెస్టిండీస్ విజయం

భారీ లక్ష్యం

కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా సెదికుల్లా అటల్ (44), రహ్మానుల్లా గుర్బాజ్ (30) రాణించారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ భారీ స్కోరు నమోదు చేసింది. కెనడా బౌలర్లలో జస్కరన్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు.అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడాను ఆఫ్ఘన్ బౌలర్లు కట్టడి చేశారు.

T20 WC 2026: Afghanistan thrash Canada in final league match
T20 WC 2026: Afghanistan thrash Canada in final league match

సీనియర్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ తన స్పిన్ మాయాజాలంతో కెనడా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. కేవలం 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. దీంతో కెనడా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్ డిలో 4 మ్యాచ్ లలో రెండు విజయాలతో తమ ప్రయాణాన్ని ముగించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870