
న్యూజిలాండ్ జట్టుతో రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఎట్టకేలకు తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. దాదాపు 468 రోజుల తర్వాత తొలి అర్ధశతకం నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన పునరాగమనం వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. తన భార్య ఇచ్చిన కీలక సలహాయే తనను తిరిగి ఫామ్‌లోకి తెచ్చిందని అతను వెల్లడించాడు.మ్యాచ్ అనంతరం బీసీసీఐ పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఇషాన్ కిషన్‌తో సూర్య మాట్లాడాడు.
Read Also: Viral Video: హార్దిక్ పాండ్యా, మురళీ కార్తిక్ మధ్య వాగ్వాదం?
పూర్తిగా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టా
ఫామ్ కోల్పోవడంపై ఇషాన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. “ప్రతి ఒక్కరికీ ఇంట్లో ఒక కోచ్ ఉంటారు. వారే మన భార్యలు. నా భార్య కూడా నాకు ఒక సలహా ఇచ్చింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త సమయం తీసుకోమని ఆమె చెప్పింది. నా మనసును ఆమె బాగా చదవగలదు. ఆమె సలహాను పాటించి, నెమ్మదిగా ఆడటం ప్రారంభించాను.
అదే మంచి ఫలితాన్ని ఇచ్చింది” అని సూర్య వివరించాడు.అంతేకాకుండా ఇటీవల తీసుకున్న మూడు వారాల విరామం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కూడా తన మానసిక స్థితిని మెరుగుపరిచిందని సూర్య తెలిపాడు. “ఆ విరామంలో పూర్తిగా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాను. నెట్స్‌లో బాగా ఆడుతున్నప్పటికీ, మ్యాచ్‌లో పరుగులు చేస్తేనే అసలైన ఆత్మవిశ్వాసం వస్తుంది. సహనంతో ఉండటం చాలా ముఖ్యం” అని, సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) అన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: