हिन्दी | Epaper

Gavaskar on Kavya Maran: కావ్య మారన్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్

Anusha
Gavaskar on Kavya Maran: కావ్య మారన్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్

Gavaskar on Kavya Maran: ‘ది హండ్రెడ్’ (The Hundred) లీగ్ వేలంలో జరిగిన ఒక పరిణామం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ కు చెందిన ‘సన్‌రైజర్స్ లీడ్స్’ (SRL) జట్టు, పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ ధరకు కొనుగోలు చేయడంపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Sarfaraz Ahmed Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీకి సహ యజమానిగా ఉన్న కావ్య మారన్ , అబ్రార్ అహ్మద్‌ను భారతీయ కరెన్సీలో సుమారు రూ.2.3 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో భారీ విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో భారత అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ఆటగాడిని తీసుకోవడంపై అనేక మంది ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో గవాస్కర్ స్పందించాడు.

గవాస్కర్ కామెంట్లు

అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడం వల్ల సన్‌రైజర్స్ లీడ్స్, కావ్య మారన్ పై వస్తున్న విమర్శలు అర్థం చేసుకోదగినవేనని సునీల్ గవాస్కర్ అన్నాడు. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ విమర్శలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇండియా, పాకిస్థాన్ మధ్య శత్రుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.పాకిస్థాన్ క్రికెటర్ పై ఖర్చు చేసే డబ్బు పరోక్షంగా ఇండియన్ల చావు కోసమే వాడతారని సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్లు చేశాడు. “ది హండ్రెడ్ లో,

Sunil Gavaskar fires on Kavya Maran
Sunil Gavaskar fires on Kavya Maran

ఒక పాకిస్థానీ ఆటగాడిని భారత యజమాని కొనుగోలు చేయడంపై వచ్చిన ఈ గందరగోళం ఆశ్చర్యకరం కాదు. 2008 నవంబర్లో ముంబై దాడులా తర్వాత, భారత ఫ్రాంచైజీ యజమానులు ఐపీఎల్ కోసం పాకిస్థానీ ఆటగాళ్లను పట్టించుకోవడం లేదు.పాకిస్థానీ ఆటగాడికి చెల్లించే డబ్బు నుంచి అతను తన ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లిస్తాడు. ఆ డబ్బును ఆయుధాల కొనుగోలు కోసం ఆ ప్రభుత్వం వాడుతుంది. చివరకు భారత సైనికుల, పౌరుల ప్రాణాలను తీస్తారు” అని గవాస్కర్ పేర్కొన్నాడు.

జీవితాల కంటే ముఖ్యమా?

ఇండియన్ ఫ్రాంచైజీ అయినా లేదా అనుబంధ టీమ్ అయినా కూడా ఓనర్ ఇండియన్ అయితే పాక్ క్రికెటర్ కు ఇచ్చే డబ్బుతో భారతీయుల చావుకు కారణమవుతారు. ‘ది హండ్రెడ్’లో జట్టు కోచ్, న్యూజిలాండ్ కు, చెందిన డేనియల్ వెట్టోరికి ఇది అర్థం కాకపోవచ్చు. అందుకే టీమ్ లో పాకిస్థానీ ఆటగాళ్లను కోరుకోవచ్చు. కానీ ఓనర్ దీన్ని అడ్డుకోవాల్సింది. ఏ ఇతర దేశం ఆడనటువంటి ఫార్మాట్లో టోర్నమెంట్ గెలవడం భారతీయ జీవితాల కంటే చాలా ముఖ్యమా?” అని మిడ్ డేకు రాసిన కాలమ్ లో గవాస్కర్ ప్రశ్నించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కావ్య మారన్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్

కావ్య మారన్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్!

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్!

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ వీడ్కోలు

గిల్, మంధానలను వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

గిల్, మంధానలను వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

ధోని రిటైర్మెంట్‌ పై ఉతప్ప ఏమంటున్నారు?

ధోని రిటైర్మెంట్‌ పై ఉతప్ప ఏమంటున్నారు?

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

పాక్ విండీస్ సిరీస్ ఎఫెక్ట్.. ది హండ్రెడ్ టోర్నీకి అబ్రార్ దూరం?

పాక్ విండీస్ సిరీస్ ఎఫెక్ట్.. ది హండ్రెడ్ టోర్నీకి అబ్రార్ దూరం?

సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో లోపాలు.. ఆ ముగ్గురు అవుటైతే అంతేనా?

సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో లోపాలు.. ఆ ముగ్గురు అవుటైతే అంతేనా?

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

📢 For Advertisement Booking: 98481 12870