టెక్ దిగ్గజం గూగుల్.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో ఓ చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. గూగుల్‌కు చెందిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడల్ ‘జెమిని 3 ప్రో’ (Gemini 3 Pro) ఇప్పుడు క్రికెట్ మైదానంలో చోటుచేసుకునే ప్రతి కదలికను విశ్లేషించి అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైంది.
Read Also: Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌కు కోహ్లీ గుడ్ బై?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర
ICCతో Google ఒప్పందంపై ఆ సంస్థ CEO సుందర్ పిచాయ్ (Sundar Pichai) తనదైన శైలిలో ట్వీట్ చేశారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ భాగస్వామ్యంపై స్పందిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. “ఇకపై గూగుల్ మీ ‘గూగ్లీ’కి సాయం చేస్తుంది” అంటూ ఆయన క్రికెట్ పరిభాషలో చమత్కరించారు. సంక్లిష్టమైన క్రికెట్ సాంకేతికతను, వ్యూహాలను సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: