हिन्दी | Epaper

SRH Squad: ఇది స్వ్కాడ్ కాదు.. కావ్యపాప ఖతర్నాక్ బ్యాచ్

Saritha
SRH Squad: ఇది స్వ్కాడ్ కాదు.. కావ్యపాప ఖతర్నాక్ బ్యాచ్

SRH Squad: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. గత సీజన్‌లో నిరాశపరిచిన SRH, ఈసారి బలమైన జట్టుతో తిరిగి రావాలని చూస్తోంది. 

గత సీజన్‌లో పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) టీం ఆరో స్థానంతో ముగించింది. 14 మ్యాచ్‌లలో 7 ఓటములు ఎదుర్కొని ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. కానీ ఈసారి కొత్త ప్లేయర్లతో, సమతుల్య జట్టుతో బలంగా తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: IPL 2026: సీఎస్‌కేలో సంజు శాంసన్ విధ్వంసం

SRH Squad: ఇది స్వ్కాడ్ కాదు.. కావ్యపాప ఖతర్నాక్ బ్యాచ్
SRH Squad: This isn’t just a squad it’s Kavya-papa’s lethal crew!

SRH స్క్వాడ్ 2026..

ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రైన్స్ ఫులేట్రా, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమ్మిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కద్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.

SRHకు ఈ సీజన్‌లో అతిపెద్ద బలం బ్యాటింగ్ లైనప్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ టాప్ ఆర్డర్‌లో అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వగలరు. ముఖ్యంగా కిషన్ ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్. అభిషేక్ శర్మ నుంచి లియామ్ లివింగ్‌స్టోన్ వరకు అనేక ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. వీరు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ప్రభావం చూపగలరు. ఇది జట్టుకు ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. బలమైన బ్యాటింగ్, అనేక ఆల్‌రౌండర్లతో SRH ఈసారి డేంజరస్ టీమ్‌గా మారే అవకాశముంది. అయితే బౌలింగ్ సమస్యలు పరిష్కరించగలిగితేనే ప్లేఆఫ్స్ రేసులో నిలబడగలదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870