ప్రతి ఏటా అమెరికాలో జరిగే సూపర్ బౌల్ ఈవెంట్ సమీపించగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ (Sports) ఇదేనని అభిమానులు వాదిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫుట్‌బాల్ (సాకర్) తిరుగులేని రాజుగా నిలుస్తుండగా, డిజిటల్ వీక్షణలో క్రికెట్ వేగంగా దూసుకొస్తోంది. అమెరికాలో సూపర్ బౌల్‌కు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్త ప్రేక్షకాదరణలో దాని స్థానం చాలా వెనుక ఉంది.ప్రపంచంలో అత్యధిక మంది చూసిన ఫైనల్స్‌లో ఫిఫా ప్రపంచకప్‌దే అగ్రస్థానం.
Read Also: Tejaswin Shankar : చైనాలో భారత్ గర్జన, తేజస్విన్ శంకర్ కు గోల్డ్ మెడల్!
రెండో అతిపెద్ద ఈవెంట్‌గా క్రికెట్
2022లో ఖతార్ వేదికగా అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 కోట్ల మంది వీక్షించారు. ఫిఫా అధికారిక లెక్కల ప్రకారమే ఈ సంఖ్య నమోదైంది. యూరప్, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఏకకాలంలో ఇంత భారీ సంఖ్యలో వీక్షకులను ఆకట్టుకున్న ఏకైక ఈవెంట్ ఇదే.ఫిఫా ప్రపంచకప్ స్థాయిలో కాకపోయినా,

అత్యధిక వీక్షకులను సంపాదించుకున్న రెండో అతిపెద్ద ఈవెంట్‌గా క్రికెట్ (Sports) ప్రపంచకప్ నిలిచింది. 2023లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్‌ను సుమారు 50 కోట్ల మంది చూశారని ఐసీసీ, దాని అధికారిక ప్రసార భాగస్వాములు అంచనా వేశాయి. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లోని అపారమైన జనాభా ఈ సంఖ్యకు కారణమైంది. బార్క్ (BARC) డేటా ప్రకారం కేవలం భారత్‌లోనే డిస్నీ స్టార్ నెట్‌వర్క్‌పై ఈ మ్యాచ్‌కు 422 బిలియన్ల వీక్షణ నిమిషాలు నమోదయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: