Rohit Sharma : భారత క్రికెట్ జట్టుకు 13 ఏళ్ల పాటు ఐసీసీ ట్రోఫీ దక్కకపోవడానికి ప్రధాన కారణం విఫలమవుతామనే భయం కావొచ్చని టీ20 వరల్డ్ కప్ విజేత మాజీ కెప్టెన్ Rohit Sharma అభిప్రాయపడ్డారు. 2011లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత్, మళ్లీ 2024లోనే ఐసీసీ ట్రోఫీని అందుకుంది.
జియో హాట్‌స్టార్ షోలో మాట్లాడిన రోహిత్, “పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకరోజు మళ్లీ పైకి వస్తాయనే నమ్మకం నాకు ఉంది. కానీ అది 13 ఏళ్లు పడుతుందని మాత్రం ఊహించలేదు” అని అన్నారు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా, ఐసీసీ ప్రధాన ట్రోఫీ కోసం జట్టు చాలా కాలం వేచిచూడాల్సి వచ్చిందన్నారు.
Read Also: India vs New Zealand T20 :టీమ్ ఇండియా ఘన విజయం

తన కెప్టెన్సీలో, అలాగే మాజీ హెడ్ కోచ్ Rahul Dravid తో కలిసి(Rohit Sharma) ఆటగాళ్లలో ఉన్న భయాన్ని తొలగించేందుకు ప్రయత్నించామని రోహిత్ చెప్పారు. ప్రతి ఆటగాడికి స్పష్టమైన పాత్రలు ఇవ్వడం, పూర్తి స్వేచ్ఛ కల్పించడం ద్వారానే జట్టు విజయ బాటలోకి వచ్చిందని వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: