టీమిండియా (Team India) స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)లకు (RO-KO) సంబంధించి బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సెంట్రల్ కాంట్రాక్టుల (Central Contracts) పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వీరి వార్షిక జీతాలకు భారీగా కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అత్యున్నత ఏ+ గ్రేడ్‌లో ఉన్న వీరిద్దరినీ బీ కేటగిరీకి మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ (RO-KO)ఒక్కో ఫార్మాట్‌కే పరిమితమయ్యారు.
Read Also: India U19 World Cup : యంగ్ ఇండియా హ్యాట్రిక్! సూపర్ సిక్స్‌లోకి దూసుకెళ్లిందా?

మాకు ఎలాంటి విభేదాలు లేవు
ఈ నేపథ్యంలో అసలు ఏ+ కేటగిరీనే పూర్తిగా రద్దు చేయాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పోర్ట్స్ స్టార్ తో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు.”ఈ ప్లాన్‌ను త్వరలోనే అమలు చేస్తాం. ఏ+ కేటగిరీకి అర్హులైన ఆటగాళ్లు ఇప్పుడు కేవలం ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నారు.
ఏ+ కోసం మేము నిర్దేశించిన ప్రమాణాలను వారు అందుకోవడం లేదు. అందుకే ఆ కేటగిరీని తొలగిస్తున్నాం. ఇది పూర్తిగా క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయమే. ఆటగాళ్లతో మాకు ఎలాంటి విభేదాలు లేవు” అని సైకియా స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: