ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆర్సీబీ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 227 పరుగులు చేసినప్పటికీ రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో జట్టు ఈ దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో,కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant)కు రూ. 30 లక్షల ఫైన్ పడింది. లక్నో జట్టు స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో లక్నో జట్టుకు బీసీసీఐ జరిమానా వేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా లక్నో ప్లేయర్లు అందరికీ రూ. 12 లక్షల చొప్పున జరిమానా విధించింది.
విజయం
ఈ సీజన్‌లో నియమావళిని మూడోసారి లక్నో జట్టు ఉల్లంఘించినట్లు ఐపీఎల్ తన ప్రకటనలో పేర్కొంది. అందుకే జట్టు కెప్టెన్ అయిన పంత్‌కు రూ. 30 లక్షలు ఫైన్ వేసినట్లు చెప్పింది. లక్నో జట్టులోని మిగతా ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా 50 శాతం ఫీజులో కోత విధించనున్నారు.కాగా, నిన్నటి హై స్కోరింగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. కానీ, ఆర్‌సీబీ ఈ భారీ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి, మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఇన్నింగ్స్
ఎల్ఎస్‌జీ సారథి రిషబ్ పంత్ అజేయ శతకం చేసినా తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అతడు 61 బంతుల్లో 118 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ(Jitesh Sharma) 85 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో లక్నో జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. ఈ సీజన్‌ను లక్నో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో ముగించింది. 14 మ్యాచులాడిన ఎల్ఎస్‌జీ 6 విజయాలు మాత్రమే నమోదు చేసింది. మరోవైపు ఆర్‌సీబీ ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లి, క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. గురువారం చండీఘడ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది.
Read Also : Lucknow: ఐపిఎల్ లో లక్నో చెత్త రికార్డు